Breaking News

బీఆర్‌ఎస్‌ ఆఫీసుపై దాడి.. కేటీఆర్‌ సంచలన హెచ్చరిక

Published on Sun, 11/02/2025 - 12:33

సాక్షి, హైదరాబాద్‌: భద్రాచలంలోని మణుగూరులో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంపై దాడి, ధ్వంసంపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మణుగూరు ఘటనపై కేటీఆర్‌ మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నలుమూలలా, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా ప్రతి చోటా రౌడీల రాజ్యం నడుస్తోంది. అరాచకత్వం కొనసాగుతోంది. దీనికి చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది’ అని హెచ్చరించారు. మరోవైపు.. పార్టీ ఆఫీసు దాడి ఘటనను వ్యతిరేకిస్తూ మణుగూరు అంబేద్కర్‌ సెంటర్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఆందోళన కార్యకర్తలు చేపట్టారు.

ఇక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బీఆర్‌ఎస్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్‌కు నిప్పు పెట్టడంతో పాటు ఆవరణలో ఫ్లెక్సీలు చింపేశారు. ప్రభుత్వ స్థలంలో భారత రాష్ట్ర సమితి కార్యాలయం నిర్మించారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ ఆఫీసుపై బీఆర్‌ఎస్‌ జెండాను తొలగించి కాంగ్రెస్‌ జెండాను ఎగురవేశారు. దీంతో, పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)