Breaking News

పొంగులేటి.. జైలుకెళ్లడానికి రెడీగా ఉండు: కేటీఆర్‌

Published on Wed, 11/06/2024 - 11:56

సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణ మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు జరిగితే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ‍ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. మంత్రి పొంగులేటి జైలుకు పోవడానికి రెడీగా ఉండాలని కేటీఆర్‌ అన్నారు. అలాగే, భారీ స్కామ్‌లు జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తోందని ఘాటు విమర్శలు చేశారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడించినట్లు ఆడితే ఉన్నతాధికారుల ఉద్యోగాలు ఊడగొడుతాం. బీఆర్‌ఎస్‌ తరఫున ఉన్నతాధికారులకు ఇదే మా హెచ్చరిక. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రేవంత్, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలంగాణను దోచుకుంటున్నారు. నీటి ప్రాజెక్టుల పేరుతో సీఎం రేవంత్ భారీ కుంభకోణానికి తెర తీశారు. మంత్రి పొంగులేటి, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీలు డబ్బులు పంచుకుంటున్నాయి

రేవంత్ రెడ్డి అవినీతిపై బండి సంజయ్‌ ఎందుకు మాట్లాడటం లేదు. భారీ కుంభకోణాలు జరుగుతుంటే.. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది?. కేబినెట్‌లో ఉన్న మంత్రి పొంగులేటి కంపెనీకి కాంట్రాక్టులు ఎలా ఇస్తారు?. పొంగులేటి జైలు పోవటానికి రెడీగా ఉండాలి. వాళ్ళు, వీళ్ళు జైలుకు పోతారని చెప్పటానికి పొంగులేటి ఎవరు?. పొంగులేటి ఏమైనా హోంమంత్రినా?. బాంబులు పేల్చుడు కాదు.. ముందు పొంగులేటి జైలు పోవటానికి సిద్ధంగా ఉండాలి.

మూసీ ప్రాజెక్ట్ కోసం రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతున్నాడు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు జరిగితే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)