Breaking News

పొంగులేటి సవాల్‌ స్వీకరించిన కేటీఆర్‌.. సీఎం కుర్చీకి ఎసరు అంటూ..

Published on Sun, 09/22/2024 - 11:55

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మంత్రి పొంగులేటి సవాల్‌ను కేటీఆర్‌ స్వీకరించారు. అమృత్‌ టెండర్లపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ అడుగుదాం రావాలంటూ ప్రతి సవాల్‌ విసిరారు. దీంతో, రాష్ట్రంలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి సవాల్‌ను స్వీకరిస్తున్నాను. చిత్తశుద్ధి ఉంటే రండి.. హైకోర్టు సీజే దగ్గరకు పోదాం. అమృత్‌ టెండర్లపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ అడుగుదాం. అక్రమాలు జరగలేదని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. లేదంటే సెంట్రల్‌ కమిషనర్‌ దగ్గరకు పోదాం. రేవంత్‌ ముఖ్యమంత్రి పదవి ఊడగొట్టాలన్న ఆలోచన ఉన్నట్టుంది. రాజీనామా చేస్తానని పొంగులేటి ప్రగల్భాలు చేస్తున్నాడు. అమృత్‌ టెండర్లు రద్దు చేసి సిగ్గు తెచ్చుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

 

 

కేటీఆర్‌ ఆరోపణలపై అంతకుముందు మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. టెండర్లు పిలిచినట్లు కేటీఆర్‌ నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం. నిరూపించలేకపోతే కేటీఆర్‌ రాజీనామా చేస్తారా? ఈ ప్రభుత్వం కేవలం రూ.3,516 కోట్ల పనులకే టెండర్లు పిలిచింది. గత ప్రభుత్వంలో మిషన్‌ భగీరథ పేరు మీద రూ.39వేల కోట్ల ప్రజాధనం లూటీ చేశారు. ఆధారాలతో కూడిన విమర్శలు చేయాలి. ఖమ్మంలో నాపై పోటీ చేసిన ఉపేందర్‌రెడ్డి అల్లుడు సృజన్‌రెడ్డి ఒకటి దక్కించుకున్నారు. టెండర్లు వేయొద్దని ఏ కంపెనీని కూడా ప్రభుత్వంలోని పెద్దలు బెదిరించలేదు. మేం పిలిచిన రీ టెండర్లలో గతంకంటే రూ.54 కోట్లు తక్కువకే బిడ్లు వచ్చాయి అంటూ కామెంట్స్‌ చేశారు. ఇదే సమయంలో పోలింగ్‌ తేదీకి ఒక్కరోజు ముందే గత ప్రభుత్వం ఈ టెండర్లను కట్టబెట్టిందని గుర్తు చేశారు. 

ఇది కూడా చదవండి: కూకట్‌పల్లిలో హైడ్రా.. బీఆర్‌ఎస్‌ నేత అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)