కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!
Breaking News
ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ
Published on Mon, 06/16/2025 - 08:44
కేటీఆర్ ఏసీబీ విచారణ అప్డేట్స్..
ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ
- ఫార్ములా ఈ కారు రేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ
- హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగంపై ఏసీబీ అధికారుల ప్రశ్నలు
- ఏడుగంటల పాటు సాగిన విచారణ
- ఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్‌కు ఏసీబీ ప్రశ్నలు
- కేబినెట్ ఆమోదం లేకుండా నిధులు ఎందుకు మళ్లించారని విచారణ
- కేటీఆర్ స్టేట్మెంట్ణు రికార్డ్ చేసిన ఏసీబీ అధికారులు
- అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని కేటీఆర్‌కు సూచన
కేటీఆర్ ఏసీబీ విచారణపై కవిత ఆసక్తిర వ్యాఖ్యలు
- కేటీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్దతు
- ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది.
- ఏసీబీ విచారణపై కవిత స్పందించారు
- ‘ఏ పార్టీలోనైనా లోపాలు ఉన్నప్పుడు అధినేతకు చెప్పుకోవడం సహజం
- చెప్పుకున్నంత మాత్రానా దాన్నేదో భూతద్దంలో చూపించాల్సి అవసరం లేదు
- మా పార్టీలో లోపాలు సవరించుకుంటాం
- మా మీద ఎవరైనా దాడి చేస్తే ఊరుకోం
- ప్రధాన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఏసీబీ విచారణలు అంటూ హడావిడి
- మా కార్యకర్తలను, నేతలను ఇళ్లకు రాకుండా అడ్డుకోవడం దారుణం
- కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు.
- గంటలకు పైగా కేటీఆర్‌పై ప్రశ్నం వర్షం.
కేటీఆర్ విచారణ ప్రారంభం..
- ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మొదలైన కేటీఆర్ విచారణ.
- కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఐఓ ఆఫీసర్ మాజీద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతూ రాజ్, డైరెక్టర్ తరుణ్ జోషి.
- ఏసీబీ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం పరిసరాల్లో భారీగా మొహరించిన బీఆర్ఎస్ శ్రేణులు.
- ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కొనసాగుతున్న విచారణ..
- IAS అరవింద్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీ..
- FEOతో ఒప్పందాలు నగదు, బదిలీ అంశాలపై ప్రశ్నిస్తున్న ఏసీబీ..
- క్యాబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు.
- ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటి?
- బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపై ప్రశ్నిస్తున్న ఏసీబీ..
- ఇప్పటికే సేకరించిన పత్రాలు ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీ..
- Feo కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ.
కేటీఆర్‌తో నలుగురి బృందం..
- కేటీఆర్‌తో ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న నలుగురు బృందం...
- న్యాయవాది రామచందర్ రావు, మహేందర్ రెడ్డి, తిరుపతి, మరో న్యాయవాది.
- 10.30 గంటలకు మొదలు కానున్న కేటీఆర్ ఏసీబీ విచారణ..
ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్
- ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్
- కేటీఆర్ వెంట అడ్వొకేట్ రామచందర్‌రావు
- ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్‌ను విచారించనున్న ఏసీబీ
తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ఆఫీస్‌కు బయల్దేరిన కేటీఆర్
- కాసేపట్లో ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్
- ఈ-రేస్ కేసులో విచారణకు హాజరు కానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
- ఎఫ్ఈవో కంపెనీకి రూ. 54.88 కోట్లు బదిలీ చేయడంపై విచారణ
- ఇప్పటికే ఏసీబీ అధికారుల లోతైన దర్యాప్తు
అక్రమ కేసులకు భయపడం: కేటీఆర్
- అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు
- ఆరు నెలల నుంచి విచారణ జరుపుతున్నారు.. ఏం తేల్చారు?
- అవసరమైతే అరెస్టు కూడా చేస్తారు కావొచ్చు
- చట్టాలు, కోర్టులపై మాకు గౌరవం ఉంది
- మూడు సార్లు కాదు.. 30 సార్లు పిలిచినా విచారణకు వస్తా
- అక్రమ కేసులకు భయపడం
- అరెస్ట్ చేసినా వెనక్కి తగ్గం
- జైలు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాం
- లై డిటెక్టర్‌కు కూడా నేను సిద్ధం
- కాంగ్రెస్, బీజేపీవి దొంగాటలు
- డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ కేసులు
- రైతు బంధును.. ఎలక్షన్ బంధుగా మార్చేశారు
- 420 గ్యారెంటీలు, హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం
- లక్షలాది మంది కేసీఆర్ సైనికులను అడ్డుకోలేరు
తెలంగాణభవన్ చేరుకున్న కేటీఆర్
- కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు.
- తెలంగాణభవన్ వద్ద భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు
- తెలంగాణ భవన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు.
కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ..
- నందిని నగర్ నివాసంలో కేసీఆర్‌తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు..
- తాజా పరిస్థితులపై చర్చ..
- మరికాసేపట్లో తెలంగాణ భవన్ కు రానున్న కేటీఆర్, హరీష్ రావు..
కాసేపట్లో తెలంగాణ భవన్‌కు కేటీఆర్..
- కోకాపేటలో తన నివాసం నుండి తెలంగాణ భవన్‌కు బయలుదేరిన కేటీఆర్..
- మరికాసేపట్లో తెలంగాణ భవన్‌కు చేరుకోనున్న కేటీఆర్..
- 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్..
- బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల ఆంక్షలు..
- భారీగా మోహరించి పోలీసులు..
- ఏసీబీ ఆఫీస్ ముందు 400 మంది పోలీసు బందోబస్తు..
- ఏసీబీ కార్యాలయం ఎవరిని అనుమతించని పోలీసులు
👉తెలంగాణలో ఫార్ములా-ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు రానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
👉మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. కాంగ్రెస్ పార్టీ విచారణలు, కమిషన్ల వలన, రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదేలేదు. మీ ఆరు గ్యారెంటీల అమలు మోసాన్ని ఎండబెట్టడంలో ఇవేవీ మమ్మల్ని ఆపలేవు. ఎన్ని కుట్రలు చేసినా భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో, డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు చేసిన దగాను ఎండగడుతూనే ఉంటాం. ఎన్ని కుట్రలైనా చేసుకో రేవంత్ రెడ్డికి సవాల్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
I will never be deterred by your enquiries, commissions and political vendetta
We @BRSparty will continue to expose the Hollowness of #420 promises, Deceptive declarations and never to be trusted Six Guarantees
Bring it on Revanth 👍 pic.twitter.com/yFUOXmoeoP— KTR (@KTRBRS) June 16, 2025
👉ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ జనవరి 9వ తేదీన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. నాడు దాదాపు ఆరున్నర గంటల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. తన లాయర్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
Tags : 1
