Breaking News

‘తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్‌ మాత విగ్రహం’

Published on Sun, 12/08/2024 - 12:05

సాక్షి, నల్లగొండ: తెలంగాణను అన్ని రంగాల్లో‌ నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి. అలాగే, కాంగ్రెస్‌ పెడుతున్నది తెలంగాణ తల్లి విగ్రహం కాదు.. కాంగ్రెస్‌ మాతా విగ్రహమని ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇంకా కేసీఆర్‌ నామస్మరణే చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు. కాంగ్రెస్ మాతా విగ్రహం. కాంగ్రెస్ మాత విగ్రహాన్ని సచివాలయంలో పెట్టొద్దు. గాంధీ భవన్‌లో పెట్టుకోండి. కేసీఆర్ నామస్మరణ చేస్తోందే రేవంత్ రెడ్డి. కేసీఆర్ నా కలలోకి వస్తున్నాడని రేవంత్ ఒప్పుకున్నాడు. కేసీఆర్ ప్రజల హృదయం నిండా ఉన్నాడు. కేసీఆర్ నరసింహస్వామిలా బయటకు వస్తాడేమో అని రేవంత్‌కు భయం పట్టుకుంది. మేం ట్రయల్ రన్ చేసిన ప్రాజెక్టును ప్రారంభించారు.

కేసీఆర్ ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు కానీ ఒక రూపాయి నిధులు ఇవ్వలేదు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నా జిల్లాకు ఒరిగిందేమీ లేదు. ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేయలేదు. 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఇచ్చినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు. కాంగ్రెస్ చేతకానితనం వల్లనే కరువు, ఫ్లోరైడ్ వచ్చింది. కాంగ్రెస్ నిర్లక్ష్యం కారణంగానే జిల్లా నాశనం అయింది. ఫ్లోరైడ్‌ను లేకుండా చేసేందుకు మిషన్ భగీరథ నల్లగొండ జిల్లాలోనే ప్రారంభించాడు. వైటీపీఎస్‌ని ఆపేస్తా అని ఆనాడు కోమటిరెడ్డి అన్నాడు. అనేక కుట్రలు చేశాడు. నిన్న మంత్రులు మాట్లాడుతుండగానే జనాలు వెళ్లిపోయారు.

రేవంత్ చేసిందేమీ లేదు.. బూతులు మాట్లాడటం తప్ప. కాంగ్రెస్‌ ఇచ్చిన ఉద్యోగాలు 12000 మాత్రమే. మిగతా 50వేలు  కేసీఆర్‌ ఇచ్చినవే. మూసీ మురికి వదిలించేందుకు ప్రక్షాళన మొదలు పెట్టిందే మేము. మూసీ ప్రక్షాళన చేసి‌ తీరాల్సిందే. తెలంగాణను అన్ని రంగాల్లో‌ నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ నాయకత్వంలో ప్రపంచంలో తక్కువ కాలంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతం తెలంగాణ. గోదావరి జలాలను ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీసుకొచ్చిందే కేసీఆర్. మంత్రులు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండా పంట పండాయి అనడం దారుణం. అభివృద్ధి చేయకపోతే మీ భరతం పడతా. మంత్రులు ప్రజలను ఏవిధంగా లూటీ చేశారో అన్ని ఆధారాలు ఉన్నాయి. మీ‌ బాధిత సంఘాలు కూడా ప్రారంభం అయ్యాయి’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య