Breaking News

సీఎం వద్దే హోంశాఖ.. పోలీసులకే రక్షణ లేదు: హరీష్‌రావు

Published on Mon, 10/20/2025 - 12:01

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వద్దే హోంశాఖ ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ప్రభుత్వంలోని పెద్దలు గుండాల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు దీపావళి సందర్బంగా హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఒక రౌడీషీటర్.. పోలీసును హత్య చేసిన ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో బహిర్గతం చేసింది. పోలీసులకే రక్షణ లేకపోవడమేంటి?. ముఖ్యమంత్రి దగ్గర హోమ్ శాఖ ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవు. కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వంలోని పెద్దలు గుండాల లాగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకుండా పోయింది.

పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడేది వాస్తవం కాదా?. మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులే అంత ఓపెన్‌గా మాట్లాడుతుంటే.. ఇంకా తప్పు జరగలేదని ఎవరు భావించాల్సి ఉంటుంది?. ఈ అంశంపై సిట్ విచారణ చేపట్టాలి. పెట్టుబడిదారులను బెదిరించి.. గన్ కల్చర్ చేపట్టి వాటాలు పంచుకుంటున్నారు. మేము అగ్రికల్చర్‌ను తీసుకొస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గన్ కల్చర్‌ను తీసుకొచ్చింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)