Breaking News

నీళ్ల విలువ తెలియని వ్యక్తులా మన నాయకులు.. హరీష్‌ ఫైర్‌

Published on Sun, 07/06/2025 - 12:26

సాక్షి, తెలంగాణభవన్‌: నీళ్ల విలువ తెలియని నాయకులు తెలంగాణలో పాలన చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్‌ రావు. కాళేశ్వరం బటన్‌ నొక్కితే నీరు వచ్చే పరిస్థితి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. మోటర్లు ఆన్‌ చేయని పక్షంలో రైతులతో కన్నెపల్లి వైపు కదులుతామని హరీష్‌ రావు హెచ్చరించారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతీరోజు ఏ నదిలో ఎంత నీరు ఉందో తెలుసుకునేవారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం వాటిని విస్మరిస్తోంది. నీళ్ల విలువ తెలియని నాయకులు మనకు పాలకులుగా ఉన్నారు. ఇప్పుడు నీరు వస్తున్నా వాటిని కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బటన్‌ నొక్కితే నీరు వచ్చే పరిస్థితి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?. కాళేశ్వరం మోట్లరు ఆన్‌ చేస్తే 15 జిల్లాలకు మేలు జరుగుతుంది. వెంటనే కాళ్లేశ్వరం మోటర్లు ఆన్‌ చేయండి. కాళేశ్వరం నీటితో రిజర్వాయర్లు నింపండి. లేదంటే లక్షలాది మంది రైతులతో కన్నెపల్లి వైపు కదులుతాం’ అని హెచ్చరికలు జారీ చేశారు.   

కాళేశ్వరానికి మాత్రమే NDSA వర్తిసుందా? SLBC కి NDSA వర్తించదా?. కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. అన్నదాతకు అక్షయ పాత్ర కాళేశ్వరం. మేడిగడ్డతో సంబంధం లేకుండా గోదావరి నీళ్ళను ఎత్తి పోయేచ్చు. పాలమూరు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజల నోరు కొడుతుండు. శ్రీశైలానికి వరద నీళ్లు వచ్చి 36 రోజుల అవుతుంది.

కల్వకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చెయ్యడం లేదు. కల్వకుర్తి మోటార్లు ఇప్పటికైనా ఆన్ చేస్తరా, లేదంటే రైతులను ఆన్ చెయ్యమంటరా?. భీమా, కోయిల్ సాగర్ మోటార్లు ఆన్ చేయడంలో పూర్తిగా నిర్లక్యం చేశారు. గేట్లు ఎత్తలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్. కృష్ణా జలాల వాడుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్యం చేస్తోంది. ఏపీకి నీళ్ళు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికైనా కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లు ఆన్ చేసి సాగునీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటూ హెచ్చరించారు.   

Harish Rao: నీళ్ల విలువ తేలియని నాయకులు పాలకులుగా ఉన్నారు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)