Breaking News

ఏడాది పాలన.. ఎడతెగని వంచన

Published on Mon, 12/09/2024 - 04:50

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏడాది పాల­న ఎడతెగని వేదనను మిగిల్చిదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. కాం­గ్రెస్‌ పాలన అంతా పరపీడన పరాయణత్వంలా మారిందని విమర్శించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ­ను కాపాడుతామని అధికారంలోకి వచ్చి.. ఏడాదిలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింద­ని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎరుగని నిర్బంధకాండను రేవంత్‌ ప్రభుత్వం అమలుచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ పా­ల­నపై ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ తరఫున హరీశ్‌రావు చార్జిషీట్‌ విడుదల చేశారు. త్వరలో ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలపై మరో చార్జిïÙట్‌ విడుదల చేస్తా­మని ప్రకటించారు. ‘సీఎం సొంత ఊరికి ఎవరైనా వెళ్లాలంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అనుమతి తీసువాల్సిన పరిస్థితి. బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూల్చి ఎమర్జెన్సీని తలపిస్తున్నాడు’అని మండిపడ్డారు. 

శ్వేతపత్రాల పేరిట రోత పత్రాలు.. 
‘రేవంత్‌ పాలన ప్రతికూల దృక్పథంతో ప్రారంభం కావడంతో ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి. శ్వేతపత్రాల పేరిట రోత పత్రాలు విడుదల చేసి రాష్ట్రం ది­వాలా తీసిందనే నెగెటివ్‌ ఇమేజ్‌ సృష్టించారు. రేవంత్‌ మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. ప్రభుత్వ ౖశాఖల మధ్య సమన్వయం లేదు. సీఎం నిర్వహిస్తున్న శాఖల్లోనే పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు పెచ్చుమీరాయి.

కృష్ణా నది ప్రాజెక్టులపై పదేండ్లు కేసీఆర్‌ కాపాడిన హక్కులను.. అధికారంలోకి వచ్చి నెల తిరక్కుండానే కేంద్రానికి కట్టబెట్టారు. కేసీఆర్‌ పాలనలో ఇరిగేషన్‌ పెరిగితే, రేవంత్‌ పాలనలో ఇరిటేషన్‌ పెరిగింది. రైతు సంక్షేమానికి రాహుకాలం.. వ్యవసాయా­నికి గ్రహణం పట్టింది. బడిలో చదువుకోవాల్సిన పిల్లలు ఆసుపత్రుల్లో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. హైడ్రా రూపంలో రేవంత్‌ రెడ్డి విధ్వంసం సృష్టించారు. మూసీ ప్రక్షాళన పేరిట మూటలు వెనకేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిక్క విధానం, తిట్ల పురాణం అవలంబిస్తున్న సీఎంకు దుర్భాష దురంధరుడు అనే బిరుదు ఇవ్వవచ్చు’అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)