కేసీఆరే సుప్రీం.. తుది నిర్ణయం పార్టీదే: హరీశ్‌రావు

Published on Fri, 09/05/2025 - 10:58

సాక్షి, హైదరాబాద్‌: కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో మాజీ సీఎం కేసీఆరే సుప్రీం అని స్పష్టం చేశారు. ఎవరి విషయంలోనైనా తుది నిర్ణయం పార్టీదే అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

మాజీ మంత్రి హరీష్‌ రావు ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. త‌న కూతురి అడ్మిష‌న్ కోసం ఆయన లండన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా లండన్‌లో బీఆర్ఎస్ NRI నేతల మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘బీఆర్‌ఎస్‌లో మాజీ సీఎం కేసీఆరే సుప్రీం లీడర్‌. కలిసి పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్‌ మాకు నేర్పించారు. ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపైనా హరీశ్‌ రావు విమర్శలు చేశారు.

మరోవైపు.. ఈ క్రమంలోనే అక్కడ మీడియా ఆయ‌న‌ను క‌విత ఇష్యూపై ప్ర‌శ్నించింది. కానీ, ఆయ‌న స‌మాధానం చెప్ప‌లేదు. ఇండియా వెళ్లిన త‌రువాత‌నే మాట్లాడ‌తాన‌ని చెప్పినట్టు తెలిసింది. రేపు ఆయన ఇండియాకు రాబోతున్నట్టు సమాచారం. అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తే ఏం మాట్లాడుతారు అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)