Breaking News

బీఆర్‌ఎస్‌లో ‘భేటీ’ల కలకలం!

Published on Mon, 01/29/2024 - 01:27

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు వరుసగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశం అవుతుండటం కల కలం రేపుతోంది. కాంగ్రెస్‌ స్వల్ప మెజారిటీతో అధికారం చేపట్టిన నేపథ్యంలో విపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నం చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈనెల 24న ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి మాణిక్‌రావు తదిత రులు సీఎం రేవంత్‌ను కలిశారు. బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా రెండు రోజుల కింద సీఎంతో భేటీ అయ్యారు. తాజాగా ప్రకాశ్‌గౌడ్‌ కూడా కలిశారు.

గతంలో టీడీపీ నుంచి వెళ్లిన నేపథ్యంలో..
సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఆయన సన్నిహి తుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తదితరులు గతంలో టీడీపీలో పనిచేసినవారే కావడంతో ఈ భేటీలకు ప్రాధా న్యత ఏర్పడింది. గతంలో టీడీపీలో పనిచేసి ప్రస్తుతం బీఆర్‌ఎస్, ఇతర పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలతో రేవంత్‌రెడ్డి సన్నిహితులు మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతాయనే అంచనాల నేపథ్యంలో.. ఆలోగా చేరికల వ్యూహాన్ని అమలు చేయాలని రేవంత్‌ భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన బీఆర్‌ఎస్‌ పెద్దలు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఇతర కీలక నేతల కదలికలపై కన్నేసినట్టు సమాచారం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)