Breaking News

పొలిటికల్‌ ట్విస్ట్‌.. డిసెంబర్‌ నాలుగున బీఆర్‌ఎస్‌ కేబినెట్‌ భేటీ

Published on Fri, 12/01/2023 - 15:06

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌ నాలుగో తేదీన సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరుగుతుందని తెలిపారు. కొత్త సచివాలయంలో కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ కేబినెట్‌ భేటీ జరుగుతుందని తెలిపారు. 

అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపుపై ధీమాతోనే కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కేసీఆర్‌ కేబినెట్‌ భేటీ ఏర్పాటు చేయడంపై ఇది అత్యాశ లేక అతి నమ్మకమా? అని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఇన్ని రోజులు సచివాలయం వైపు కూడా చూడని కేసీఆర్‌.. ఎన్నికల ఫలితాలు రాకముందే సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేయడమేంటని సెటైర్లు వేస్తున్నారు. 

మరోవైపు.. ఈరోజు(శుక్రవారం) ప్రగతిభవన్‌లో కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని వారితో చెప్పినట్టు సమాచారం. ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో కేబినెట్‌ భేటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపాయి. దీంతో, రాజకీయం హాట్‌ టాపిక్‌గా మారింది.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)