Breaking News

అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు

Published on Sat, 11/23/2024 - 21:29

న్యూఢిల్లీ:  కేవలం అభివృద్ధి రాజకీయాలకే ప్రజలు పట్టం కట్టారని, అబద్ధాల రాజకీయాలను చిత్తుచిత్తుగా ఓడించారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రగిల్చిన విద్వేషాలను జనం తిప్పికొట్టారని అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో విభజన శక్తులను, ప్రతికూల రాజకీయాలను, వారసత్వ రాజకీయాలను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని తేల్చిచెప్పారు. మహారాష్ట్రలో స్థిరత్వానికే ఓటు వేశారని, సమాజాన్ని అస్థిరపర్చాలని చూసే వారికి తగిన గుణపాఠం నేర్పారని అన్నారు.

 మహారాష్ట్ర ఎన్నికలు ఐక్య సందేశాన్ని ఇచ్చాయని, ఏక్‌ హై తో సేఫ్‌ హై నినాదాన్ని బలపర్చాయని వెల్లడించారు. జార్ఖండ్‌ ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నానని, రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత ఉత్సాహంగా పని చేస్తామని ప్రకటించారు. జార్ఖండ్‌ మరికొంత కష్టపడి పనిచేస్తే బీజేపీ గెలిచేదని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే...  

విభజన శక్తులను ప్రజలు మట్టి కరిపించారు  
‘‘ఏక్‌ హై తో సేఫ్‌ హై అనే నినాదం మొత్తం దేశానికి మహామంత్రంగా మారింది. దేశాన్ని కులం, మతం పేరిట ముక్కలు చేయాలని చూస్తున్న దుష్ట శక్తులను ఈ మంత్రం శిక్షించింది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి ఓటు వేసి ఆదరించారు. రాజ్యాంగం పేరిట అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను చిన్నచిన్న గ్రూప్‌లుగా విడదీసి లాభపడొచ్చని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు భావించాయి.

 కానీ, ప్రజలు ఆయా పారీ్టల చెంప చెళ్లుమనిపించారు. విభజన శక్తులను మట్టి కరిపించారు. దేశంలో మారుతున్న పరిస్థితులు, వాస్తవాలను గుర్తించడంలో కాంగ్రెస్‌ విఫలమైంది. అస్థిరతను ఓటర్లు కోరుకోవడం లేదు. దేశమే ప్రథమం(నేషన్‌ ఫస్టు) అనే సూత్రాన్ని నమ్ముతున్నారు. పదవే ప్రథమం(చైర్‌ ఫస్టు) అని కలలు కంటున్నవారిని ఎంతమాత్రం విశ్వసించడం లేదు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. 

ఆ హామీలను అమలు చేయ డం లేదు. ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పనితీరు ఆధారంగా మహారాష్ట్రలోనూ ఆ పార్టీపై ప్రజలు ఒక స్పష్టమైన అంచనాకు వచ్చారు. అందుకే ఎన్ని హామీలిచ్చి నా ఎన్నికల్లో గెలిపించలేదు. కాంగ్రెస్‌ తప్పుడు హామీలు, ప్రమాదకరమైన ఎజెండా మహారాష్ట్రలో పనిచేయలేదు. అంబేడ్కర్‌ ఇచ్చిన రాజ్యాంగం మాత్రమే పని చేస్తుందని మహారాష్ట్ర ఎన్నికలు తేటతెల్లం చేశాయి’’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.   
 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)