Breaking News

ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు

Published on Sat, 03/30/2024 - 18:46

సాక్షి, విజయవాడ:  ఏపీలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. 

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై చంద్రబాబు కుట్రలు
ఏపీలో ప్రభుత్వం పథకాల లబ్ధిదారులపై చంద్రబాబు కుట్రలకు తెరలేపారు. అవ్వాతాతాలపై కసి తీర్చుకుంటున్న చంద్రబాబు.. నిమ్మగడ్డ రమేష్‌ ద్వారా వాలంటీర్లపై ఫిర్యాదు చేయిచారు. చంద్రబాబు కుట్రలతో వాలంటీర్ల సేవలకు ఈసీ బ్రేక్‌ వేసింది.

వాలంటీర్లు పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వకూడదంటూ నిమ్మగడ్డ ఫిర్యాదుతో వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు పెట్టింది. పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్లు, ట్యాబ్‌లు ఉన్నతాధికారులకు అందించాలని ఆదేశించింది. కోడ్‌ ముగిసేవరకు పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఎన్నికల సంఘం పేర్కొంది.

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో పైరవీలు, అవినీతి అన్న వాటికి తావేలేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గ తారతమ్యాలకు అతీతంగా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలను అందజేయడంలో కీలకంగా పనిచేస్తున్న వలంటీర్లపై కుట్రకు ఎల్లో బ్యాచ్‌ బరితెగించింది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)