Breaking News

బీజేపీలో కృష్ణయాదవ్‌ చేరికకు బ్రేక్‌!

Published on Thu, 08/31/2023 - 03:08

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్‌ బీజేపీలో చేరికకు బ్రేక్‌ పడింది. బుధవారం బీజేపీ కా ర్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన  పార్టీ లో చేరాల్సి ఉండగా, ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఆయనపై ఉన్న స్టాంప్‌ల కుంభకో ణం కేసు, ఇతరత్రా కారణాలతో కొందరు నగర పార్టీ నేత లు కృష్ణయాదవ్‌ బీజేపీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.

గతంలో టీడీపీ, బీఆర్‌ఎస్‌లో ఉన్న కృష్ణ్ణయాదవ్‌ను చేర్చుకునే విషయంలో కోర్‌ కమిటీ ఇంకా తుది నిర్ణయం తీసుకోకముందే ఆయన చేరిక ముహూర్తం ఖరారు చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తం మీద చేరిక కార్యక్రమం వాయిదా పడటంతో ఆయన అనుచరులు నిరాశకు గురయ్యారు.
 
కృష్ణయాదవ్, తుల ఉమ వ్యవహారంలో ఈటల కినుక! 
కృష్ణయాదవ్‌ను పార్టీలో చేర్పించే విషయంలో కొంతకాలంగా సంప్రదింపులు జరిపి, పార్టీ నేతలతోనూ మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ కూడా ఈ పరిణామంతో అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది.

మరోవైపు అధికార బీఆర్‌ఎస్‌ను వదిలి తనతో పాటు బీజేపీలోకి వచ్చిన మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ ఆశిస్తున్న వేములవాడ అసెంబ్లీ స్థానం విషయంలో హామీ లభించక పోవడంపైనా ఈటల కినుక వహించినట్టు చెబుతున్నారు. మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగరరావు కుమారుడు డాక్టర్‌ వికాస్‌రావును పార్టీలో చేర్చుకోవడంపై కూడా ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. 

త్వరలోనే బీజేపీలో చేరుతా: కృష్ణయాదవ్‌
నాంపల్లి (హైదరాబాద్‌): ‘బీఆర్‌ఎస్‌ పార్టీ కోసం ఏడేళ్లు పనిచేశాను. కానీ బీఆర్‌ఎస్‌ నన్ను గుర్తించలేదు. నా సేవలను వినియోగించుకోలేదు. మరో రెండు, మూడ్రోజుల్లో బీజేపీలో చేరి బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తా’అని మాజీ మంత్రి కృష్ణయాదవ్‌ అన్నారు.

ఈ మేరకు బుధవారం నాంపల్లిలోని రెడ్‌రోజ్‌ ఫంక్షన్‌ హాలులో పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయాదవ్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇస్తానని చెప్పి రెండు పర్యాయాలు మోసం చేసిందన్నారు. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌