Breaking News

లావు, ఆంజనేయులకు బొల్లా బ్రహ్మనాయుడు సవాల్‌

Published on Sat, 06/20/2026 - 17:27

సాక్షి, పల్నాడు జిల్లా: ఎవరు భూ కబ్జాలు చేశారో తేల్చుకుందాం రండి అంటూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఆంజనేయులకు బొల్లా బ్రహ్మనాయుడు సవాల్‌ విసిరారు. నేను బహిరంగ చర్చకు సిద్ధం.. మీరు సిద్ధమైతే టైము ప్లేసు డిసైడ్ చేయండి. మీకు తోడు లోకేషన్ తెచ్చుకున్న నేను సిద్ధం. నాకు, గండిపేట భూముల కేసుకు ఎలాంటి సంబంధం లేదు’’ అని బొల్లా స్పష్టం చేశారు. 

నన్ను అక్రమంగా కేసులో ఇరికించారు. నేను అరెస్టు అయ్యే ఐదు రోజులు ముందు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నన్ను అరెస్టు చేయిస్తామని చెప్పారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు వైఎస్సార్‌సీపీ రాజకీయ బిక్ష పెట్టింది. ఓట్లేసి లావు శ్రీకృష్ణదేవరాయల్ని గెలిపించిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఆయన మోసం చేశారు. కార్యకర్తలను మోసం చేశాడు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వలేదు.

‘‘లావు శ్రీకృష్ణదేవరాయలు లాగా పదవుల కోసం పార్టీ మారే వ్యక్తిని నేను కాదు. నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా. ఢిల్లీలో లావు శ్రీకృష్ణదేవరాయలకు బినామీ పేర్లతో ఎన్ని మద్యం షాపులు ఉన్నాయో అందరికీ తెలుసు. మద్యం షాపులు తీసుకొండంటూ పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు లావు శ్రీకృష్ణదేవరాయలు బతిమిలాడాడు. లావు శ్రీకృష్ణదేవరాయలు కబంధహస్తాల్లో చిక్కుకుంటే ఏమవుతుందో మాకు తెలుసు

..వినుకొండ వస్తే బొల్లా బ్రహ్మనాయుడు నిజాయితీ తెలుస్తుంది ఢిల్లీ వెళ్తే లావు శ్రీకృష్ణదేవరాయల లిక్కర్ బాగోతం తెలుస్తుంది. లావు శ్రీకృష్ణదేవరాయలు గాని ఆయన తండ్రి గాని ఒక్క విద్యార్థికై ఎప్పుడైనా రాతి రాయితీ ఇచ్చి చదివించారా?. వైఎస్సార్‌సీపీలో ఉండి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశానికి కోవర్టుగా పనిచేశారు. వెన్నుపోటు పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు.’’ అని బొల్లా బ్రహ్మనాయుడు వ్యాఖ్యానించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)