Breaking News

ఖర్గే, రాహుల్‌కు రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు

Published on Fri, 11/22/2024 - 18:28

ఢిల్లీ: తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకుగాను కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాట్‌లకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే శుక్రవారం లీగల్‌ నోటీసులు పంపించారు. క్షమాపణలు చెప్పాలని, లేకుంటే రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసులు ఎదుర్కోవాలంటూ ఆయన హెచ్చరించారు.

ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్‌లోని ఓ హోటల్‌లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ నేత రూ.5 కోట్లు పంపిణీ చేశారని బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) నాయకుడు హితేంద్ర ఠాకూర్ మంగళవారం ఆరోపించిన క్రమంలో తావ్డే లీగల్ నోటీసు ఇచ్చారు.

ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను సుదీర్ఘ రాజకీయ జీవితంలో అలాంటి చర్యలకు ఎన్నడూ పాల్పడలేదు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ నేతలు తన పరువుకు భంగం కలిగించి పార్టీని దెబ్బతీయాలని చూశారన్నారు.  కాంగ్రెస్‌ నేతలు తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలి. అందుకోసమే ఈ నోటీసులు పంపాను’’ అంటూ తావ్డే మీడియాకు వెల్లడించారు.

 

 

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)