Breaking News

బండి సంజయ్‌ అరెస్ట్‌.. తరుణ్‌చుగ్‌ రియాక్షన్‌ ఇదే..

Published on Wed, 04/05/2023 - 13:54

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు.. బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా, సంజయ్‌ అరెస్ట్‌పై బీజేపీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. అక్రమ అరెస్ట్‌ అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తరుణ్‌చుగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

బండి సంజయ్‌ అరెస్ట్‌పై తరుణ్‌ చుగ్‌ మాట్లాడుతూ.. సంజయ్‌ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. కారణం లేకుండా సంజయ్‌ను అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికం. ప్రశ్నిస్తే జైల్లో వేస్తామంటే బీజేపీ నేతలు భయపడరు. బండి సంజయ్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్‌ చేశారు. సంజయ్‌ కోసం బీజేపీ కార్యకర్తలంతా పోరాడుతారు. కేసీఆర్‌ ఏ వ్యవస్థను గౌరవించడం లేదు. కేసీఆర్‌ సర్కార్‌ అహంకారపూరితంగా వ్యవహరిస్తోంది. కేసీఆర్‌ కుటుంబ అవినీతిపాలనపై బీజేపీ పోరాడుతుంది. అరెస్టుకు కారణాన్ని వెల్లడించడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు భయపడే కేసీఆర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు. 

మరోవైపు.. బండి సంజయ్‌ అరెస్ట్‌ బీజేపీ అధిష్టానం ఫోకస్‌ పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. కిషన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. సంజయ్‌ అరెస్ట్‌పై అమిత్‌షాకు కిషన్‌రెడ్డి వివరాలు తెలిపారు. 

ఇది కూడా చదవండి: బండి సంజయ్‌ తరలింపులో ట్విస్ట్‌ ఇచ్చిన పోలీసులు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)