Breaking News

‘అంత మాట అంటారా?.. పిల్ల చేష్టలు వద్దు’

Published on Mon, 03/17/2025 - 18:49

ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను ఔరంగజేబుతో పోలుస్తూ ఇటీవల ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆ రాష్ట్ర బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం  వ్యక్తం చేసింది. ప్రధానంగా మహారాష్ట్ర ప్రెసిడెంట్ హర్షవర్థన్ సప్కాల్.. ఫడ్నవీస్ ను ఔరంగజేబుతో పోల్చారు. దీనిపై మహారాష్ట్ర శాసనమండలిలో బీజేపీ మండిపడింది.  సప్కాల్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ శాసనమండలిలో డిమాండ్ చేసింది.

ఆదివారం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో సప్కాల్ మాట్లాడుతూ.. ‘  ఔరంగజేబు ఒక క్రూరమైన పాలకుడిగా మనకు తెలుసు. ప్రస్తుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు కూడా ఔరంగజేబు లక్షణాలే ఉన్నాయి. ఎప్పుడూ మతపరమైన అంశాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు తప్ప.. రాష్ట్రానికి చేసేందేమీ లేదు. రాష్ట్రంలోని హత్యకు గురైన సర్పంచ్ సంతోష్ దేశ్ ముఖ్ తరహా అంశాలకే ఆయన ప్రాధాన్యం ఉంటుంది. మరి ఆయన్ను ఔరంగజేబు పాలనతో పోల్చడంతో తప్పేంటి’ అని ఆరోపించారు.

పిల్ల చేష్టలు వద్దు.. : బీజేపీ స్ట్రాంగ్ రియాక్షన్‌
పబ్లిక్ లో ఏది పడితే అది మాట్లాడాతానంటే ఇక్కడ కుదరంటూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సప్కాల్ ను హెచ్చరించింది బీజేపీ.  దీనిపై బీజేపీ నాయకుడు ప్రవీణ్ దరేకర్ మాట్లాడుతూ..  ‘ చీఫ్ మినిష్టర్ రాష్ట్రంలో అత్యద్భుతంగా పరిపాలన సాగిస్తున్నారు. అటువంటి నాయకుడ్ని ఔరంగజేబుతో పోలుస్తారా?, ఇది కచ్చితంగా ఖండించాల్సిన అంశమే. ఇది మహారాష్ట్రకే అవమానం. సప్కాల్ పై కేసు ఫైల్ చేయాల్సిందే. ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటే  వేరే వాళ్లు ఈ తరహా వ్యాఖ్యలు చేయరు. సప్కాల్ పై చర్యలు ఒక ఉదాహరణ కావాలి’ అని ప్రవీణ్ దరేకర్ డిమాండ్ చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)