స్విమ్మింగ్‌ వీడియోపై బీజేపీ విమర్శలు.. కౌంటర్‌ ఇచ్చిన వైద్యమంత్రి

Published on Mon, 07/08/2024 - 19:43

బెంగళూరు:  కర్ణాటక  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి  దినేష్ గుండు రావు స్విమ్మింగ్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ మారటంలో రాష్ట్ర బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.  ‘‘రాష్ట్రంలో ఒక వైపు  నీటి కుంటలు అపరిశుభ్రతతో నిండిఉండటం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి కేసులు పెరుగుతున్న క్రమంలో ఏమి పట్టని కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం  శుభ్రమైన స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతోంది’ ’అని బీజేపీ విమర్శలు చేసింది.

 

మంత్రి స్విమ్మింగ్ వీడియోను  బీజేపీ ‘ఎక్స్‌’లో షేర్‌ చేస్తూ.. ‘‘ నీటీలో నీరో రావు’ వైద్య ఆరోగ్య విభాగం ఉంది’’ కాప్షన్‌ జతచేసింది.  రాజ్యం తగలబడుతుంటే సింగీతం వాయించిన రోమన్‌ రాజు నీరోతో పోల్చుతూ బీజేపీ వ్యంగ్యంగా కామెంట్స్‌ చేసింది. అయితే బీజేపీ చేసిన విమర్శలపై అంతే స్థాయితో కాంగ్రెస్‌ వైద్యమంత్రి దినేష్ గుండు రావు కౌంటర్  ఇచ్చారు.

‘‘స్విమ్మింగ్, వ్యాయామం నా ఫిట్‌నెన్‌ దినచర్యలో భాగం. బీజేపీ నేతలు కూడా దీనిని అనుసరించాలి. ఇలా చేయటం వల్ల మీ(బీజేపీ నేతలు) ఆరోగ్యం బాగుంటంతోపాటు మెదడు కూడా షార్ప్‌గా ఉంటుంది. అబద్దాలు, దృష్టి మళ్లించే ఆలోచనలు రాకుండా సాయం చేస్తుంది’అని చురకలు అంటించారు. అదే విధంగా మంగళూరులో పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసుల పరిస్థితిని సమీక్ష చేయడానికి ఇక్కడి వచ్చినట్లు  తెలిపారు. ఇంటింటి తిరిగి మరీ నీటి నిల్వలు పరిశీలించి, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నమని చెప్పారు.

మంత్రి కౌంటర్‌పై  కూడా బీజేపీ మరోసారి విమర్శలు చేసింది. ‘‘వ్యాయామం చేయటం ముఖ్యమే. కానీ ప్రజారోగ్యం సంక్షోభంలో ఉన్న సమయంలో  ఒక మంత్రిగా అంటువ్యాధులు పెరగకుండా  పనిచేయటం ఇంకా ముఖ్యం.  అది మీ(కాంగ్రెస్‌) పార్టీకి అస్సలు  అర్థం కాదు.  వచ్చే  మహారాష్ట్ర ఎన్నికల కోసం ప్రజల డబ్బులు దండుకోవటంలోనే  మీరు బిజీగా ఉన్నారు’’అని బీజేపీ విమర్శలు చేసింది. ఇక.. గత ఆరు నెలలుగా కర్ణాటకలో 7006 డెంగ్యూ కేసులు నమోదు అ‍య్యాయి.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)