Breaking News

మమతా బెనర్జీ ప్రభుత్వంలో కోట్లలో అవినీతి: బీజేపీ

Published on Sun, 09/08/2024 - 21:07

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణముల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)కు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జవహర్‌ సిర్కార్ రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీకి సిర్కార్‌ రాసిన లేఖ ద్వారా.. అంతర్గతంగా టీఎంసీలో సీఎం మమత అవినీతి, నియంతృత్వ విధానాన్ని తెలియాజేస్తోందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.

సిర్కార్‌ లేఖ ద్వారా పశ్చిమ బెంగాల్‌లో అన్ని సంస్థల్లో  కోట్లాది అవినీతి జరిగినట్లు తెలుస్తోందని బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా సీఎం దీదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అదేవిధంగా ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో జరిగిన జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారం ఘటనపై సీఎం మమత ప్రాధాన్యత ఏంటో తెలియజేస్తోందని అన్నారు. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగదని స్పష్టమవుతోందని తెలిపారు.

‘‘జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారం కేసు విషయంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం సీఎం మమత ప్రభుత్వంలో లేదు. అయినా ఇంకా టీఎంసీ నేతలు నిరసనకారులను వేధిస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంకా మమతా బెనర్జీ సీఎంగా ఎందుకు కొనసాగుతున్నారు? ఆమె ఇంకా ఎందుకు సీఎం పదవికి రాజీనామా చేయటం లేదు? ఆమె రాజీనామా చేయకుండా  కోల్‌కతా సీపీని, ఆర్జీకర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీష్‌ ఘోష్‌ను ఎందుకు‌ రక్షిస్తున్నారు?’ అని అన్నారు.

మరోవైపు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్‌ డాక్టర్‌ ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)