Breaking News

పార్టీలే వేరు.. ఆలోచనా విధానం ఒక్కటే

Published on Sat, 07/27/2024 - 04:54

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ లు.. పార్టీలే వేరు కానీ, నేతల ఆలోచనా విధానం మాత్రం ఒక్కటే అని బీజేపీ మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. రాష్ట్రంలో జెండాలు మారాయి తప్ప విధానాలు మార లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ల తీరుపై విమర్శలు చేశారు. కేంద్ర బడ్జెట్‌పై అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లా డారు.

కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.26 వేల కోట్లు, గ్రాంట్స్‌ కింద రూ.21 వేల కోట్లపైన చూపించారన్నారు. ఈ రెండు కలిపితే రూ.50 వేల కోట్లు తెలంగాణకు వస్తుండగా.. మరి రాష్ట్రానికి ఏమిచ్చారని ఎలా ప్రశ్ని స్తున్నారని రఘునందన్‌ నిలదీశారు. ‘నిధులు వచ్చుడో.. ఇద్దరం చచ్చుడో’అన్న వారు.. కేంద్రం తెలంగాణకు నిధులు ఇచ్చిందని తేలితే ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ముక్కు నేలకు రాస్తారా? అంటూ సవాల్‌ విసిరారు. మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వలేదన్న సీఎం, కేంద్రానికి డీపీఆర్‌ ఇచ్చారా? డీపీఆర్‌ ఇవ్వకుండా నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్‌లో కొండగల్‌కు రూ.5 వేల కోట్లు ఇచ్చుకున్న వారు కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడే హక్కు లేదన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)