Breaking News

‘మోదీ చెప్పినా.. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు’

Published on Thu, 02/27/2025 - 17:15

ఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా అభివృద్ధి ఎజెండాతో పేదలకు సంక్షేమ పథకాలతో అవినీతి రహిత ప్రజల పాలన అందిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. విపక్ష పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు తమిళనాడులో డీఎంకే, తెలంగాణలో బీఆర్ఎస్ లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు. ఆ పార్టీలు కులం, మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ.. కొత్త ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. డిలిమిటేషన్ ప్రక్రియ కొనసాగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో  పార్లమెంట్ స్థానాలకు ఎటువంటి తగ్గింపులు ఉండవని ప్రధాని మోదీ స్వయంగా  చెప్పినా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  కేటీఆర్, వినోద్, స్టాలిన్ పదే పదే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని  మండిపడ్డారు లక్ష్మణ్. తమిళనాడు పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షా దక్షిణాది ప్రాంతాల్లో ఒక్కసీటు కూడా తగ్గదని స్పష్టం చేశారని,  కానీ లేని ఎజెండాను సృష్టించి ప్రాంతీయ పార్టీలు ప్రజల నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)