Breaking News

రేవంత్‌.. కొండను తవ్వి ఎలుకను పట్టారా?: లక్ష్మణ్‌ సెటైర్లు

Published on Mon, 09/01/2025 - 12:33

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీసీ బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్‌. ఇదే సమయంలో కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్‌ కమిషన్‌ వేశారా? అని ప్రశ్నించారు. విధిలేని పరిస్థితిల్లో సీబీఐకి అప్పగించారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విధిలేని పరిస్థితిల్లో సీబీఐకి అప్పగించారు. కాళేశ్వరం అవినీతి రుజువులన్నీ సీబీఐకి అప్పగించాలి. 22 నెలల తర్వాత రేవంత్‌కు కనువిప్పు కలిగింది.  ఆరు నెలల్లో నిగ్గు తేల్చుతామని అన్నవారు ఎందుకు కాలయాపన చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్‌ కమిషన్‌ వేశారా?. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదు. ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారు?. బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్‌ పార్టీ డీఎన్‌ఏలోనే ఉంది. నెహ్రు నుంచి రాహుల్‌ గాంధీ వరకు కాంగ్రెస్‌ నేతలు బీసీలను మోసం చేశారు. కాలయాపన కొరకే ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు.

సీబీఐకి అన్ని  ఆధారాలు ఇవ్వాలి. లేదంటే బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుంది. ప్రజలకు ఉన్న అనుమానాలు నివృతి చేయాలి. కాంగ్రెస్ బీసీ బిల్లుపై మొదటి నుంచి ద్వంద్వ వైఖరి పాటిస్తుంది. ఒక్కసారేమో ఆర్డినెన్సు అన్నారు. ఇంకోసారి ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి ధర్నా చేశారు. అసలు న్యాయపరమైన చిక్కులకు మీరు తీసుకున్న చర్యలు ఏంటి?. నెపంతో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. బీసీల కొరకు సర్వే చేశారా? ముస్లిం కొరకు సర్వే చేశారా?. బీసీలను మోసం చేయడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉంది. బిల్లు పెట్టడమే కాదు బిల్లు పాస్ అయ్యేలా సీఎం రేవంత్ పూర్తి బాధ్యత తీసుకోవాలి. బీజేపీ బీసీల 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది’ అని చెప్పుకొచ్చారు. 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)