Breaking News

హైడ్రా అంటే ఒక డ్రామా: ఎంపీ ఈటల ఫైర్‌

Published on Thu, 08/29/2024 - 14:00

సాక్షి, హైదరాబాద్: హైడ్రా అంటే ఒక డ్రామా అని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌. పేదల జోలికి వచ్చిన ప్రభుత్వం ఏదీ చరిత్రలో నిలిచిన దాఖలులేవని రేవంత్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పేదలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఓల్డ్ బోయినపల్లి హస్మత్‌పేట బోయిన చెరువు చుట్టూ ఇల్లు కట్టుకున్న పేదలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడకు వెళ్లి.. ఆ ప్రాంతాన్ని ఈటల గురువారం పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడుతూ..‘హైడ్రా అంటే ఒక డ్రామా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పాలనపై కనీస అవగాహన లేదు. పేదల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వాలు నిలవలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పట్టాలు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలకు వారికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడెందుకు హైడ్రా పేరుతో డ్రామా చేస్తున్నారు.

ఒక మంత్రిగానో, ఐదేళ్ల పాటు సరైన ఎంపీగానో పనిచేస్తే సీఎం రేవంత్ రెడ్డికి పేదోళ్ల బాధ తెలిసేది. బఫర్ జోన్‌లో ఉన్నారంటూ 40 ఏళ్ల తరువాత పేదోళ్ల ఇండ్లకు నోటీసులు ఎలా ఇస్తారు. రేవంత్‌ ఏదో ఉద్దరిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు పొగడటం సరైన పద్దతి కాదు. పేదల జోలిక వస్తే ఊరుకునేది లేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ప్రభుత్వమే పేదలకు ఇచ్చిన ఇండ్లు అక్రమం ఎలా అవుతాయి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)