Breaking News

నిజాం కన్నా దుర్మార్గుడు రేవంత్‌: ఎంపీ ఈటల ఫైర్‌

Published on Fri, 09/27/2024 - 10:26

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిజాం సర్కార్‌ కంటే దుర్మార్గమైన పాలన చేస్తున్నాడు సీఎం రేవంత్‌ రెడ్డి అని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌. శని, ఆదివారాలు చూసుకుని పేదల ఇళ్లను కూల్చివేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆనందిస్తోందా? అని ప్రశ్నించారు.

హైడ్రా బాధితులు శుక్రవారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిశారు. ఈ సందర్బంగా అక్రమంగా తమ ఇళ్లను కూల్చివేసినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎంపీ ఈటల మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పేదలు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. రేవంత్‌ పాలన నిజాం సర్కార్‌ కంటే దుర్మార్గంగా ఉంది. హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తున్నారు. శని, ఆదివారాలు చూసుకొని ఇళ్లను కూలగొడుతున్నారు.

సంజయ్‌ గాంధీ కూడా ఢిల్లీలో మారుతీ కంపెనీ కోసం పేదల ఇళ్లను కూలగొట్టారు. ఆయనకు వారి ఉసురు తగిలింది అంటారు. పేదల కళ్ళలో నీళ్లు చూసేవారికి ఎప్పుడు మంచి జరగదు. పోయేకాలం వచ్చినట్టుంది కాబట్టే ఎలా ప్రవర్తిస్తున్నారు. పేదలతో పెట్టుకున్న ప్రభుత్వం బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ.. లక్ష కోట్లు పెట్టి మూసీ సుందరీ కరణ చేస్తారట. బట్టలు లేవు కానీ బంగారం కొనిపిస్తా అన్నట్టు ఉంది కాంగ్రెస్‌ నేతల తీరు. మేక వన్నె పులులు ఎన్నికలప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ ఓట్లు అడిగారు. ఇప్పుడు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడవద్దు. నేను ఉన్నంత వరకు మీ పక్షాన కొట్లాడుతాను’ అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇది కూడా చదవండి: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)