Breaking News

ఓట్ల కోసమే సీఎం రేవంత్‌ డ్రామాలు: ఈటల

Published on Tue, 02/18/2025 - 12:22

సాక్షి: ఖమ్మం జిల్లా: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని  బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీసీల పట్ల రేవంత్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. ఓట్ల కోసం సీఎం రేవంత్‌ డ్రామాలు చేస్తున్నాడని.. 45 ఏళ్లు పాటు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే.. ఒక్క బీసీ, ఎస్టీలను ముఖ్యమంత్రి చేయలేకపోయారని మండిపడ్డారు.

‘‘బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. అందుకే ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఎవరు మనవాళ్లు, అనేది చూసి ఓటు వేయాలి. మాట ఇస్తే నిలబడే వ్యక్తికి ఓటు వేయాలి. మోసం చేసేవారికి కాదు. టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచారంలో ఉపాధ్యాయులు నుంచి మంచి స్పందన వస్తుంది. 317 జీవో తీసుకొచ్చి ఉపాధ్యాయుల జీవితాల్లో మట్టి కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్న ఇప్పటికీ డీఏలు, ఇంక్రిమెంట్లు లేవు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించలేని ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం’’ అంటూ ఈటల దుయ్యబట్టారు.

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)