Breaking News

‘ప్రజా తీర్పును కాలరాస్తే.. వారిని తిరగనివ్వను’

Published on Sat, 02/14/2026 - 16:08

హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మేయర్‌ ఎన్నికల వ్యవహారం మరింత హీట్‌ పుట్టిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు ప్రధాన పార్టీలు కుట్రలు చేసి కరీంనగర్‌లో బీజేపీకి మేయర్‌ పదవి రాకుండా కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. 

బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన బండి సంజయ్‌.. ప్రజా తీర్పును కాలరాసి ఏమైనా కుట్రలు చేస్తే ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  ఈ క్రమంలోనే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 

కుట్రలు చేస్తే కరీంనగర్‌ నుంచి యుద్ధం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ మేయర్‌ ఎలా దక్కించుకుంటాయి?, బీజేపీకి మేయర్‌ పదవి రాకుండా మూడు పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయి. కరీంనగర్‌ వేదికగా మూడు పార్టీల బండారం బయటపడుతోంది. బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రజాతీర్పును కాలరాస్తే.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లను తిరగనివ్వను’ అని తీవ్రంగా హెచ్చరించారు.

కాగా, కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో  మొత్తం 66 డివిజన్లకు గాను బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. BJP 30 డివిజన్లలో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ స్పష్టమైన మెజారిటీ  ఏ పార్టీకి రాలేదు. కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌ 9, ఎంఐఎం 3 డివిజన్ల చొప్పున గెలిచాయి. ఇండిపెండెంట్లు 8  సీట్లు గెలవగా, ఫార్వర్డ్‌ బ్లాక్‌ రెండు డివిజన్లలో గెలిచింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉన్నందున, ఇండిపెండెంట్లు మరియు చిన్న పార్టీల మద్దతుతో మేయర్‌ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)