Breaking News

‘గోపీనాథ్‌ ఆస్తులను కాజేయలని కుట్ర చేస్తున్నారు’

Published on Sat, 11/08/2025 - 20:57

హైదరాబాద్‌: దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆస్తులను కాజేయడానికి కుట్ర జరుగుతుందని కేంద్ర మంత్రి ,బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. గోపీనాథ్‌ ఆస్తులపై సీఎం రేవంత్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల కన్నుపడిందన్నారు. ఈరోజు(శనివారం, నవంబర్‌ 8వ తేదీ) జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా  షేక్ పేట శివాజీ విగ్రహం వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘ గోపీనాథ్ ఆస్తులపై సీఎం, కేటీఆర్ కన్ను. గోపీనాథ్ ఆస్తులను కాజేయాలని కుట్ర చేస్తున్నారుఅందుకే ఫిర్యాదు చేసినా విచారణ చేయకుండా కుట్రలు చేస్తున్నరు. 

ఇదిగో కంప్లయింట్ కాపీ... పంపిస్తున్నా. సీఎం.. నీకు రోషముంటే, పౌరుషముంటే, చీము నెత్తురుంటే.. గోపీనాథ్ మరణంపై విచారణ చేయాలి. గోపీనాథ్ ఆస్తుల కోసం దొంగ నాటకాలు ఆడుతున్న మాగంటి సునీతకు టిక్కెట్ ఇచ్చారు. వాస్తవాలు చెబుతుంటే... నన్ను మతతత్వవాది అంటున్నరు. మతతత్వవాది అని బోర్డు ఇస్తే మెడలో వేసుకుని తిరిగేందుకూ వెనుకాడను. 

80 శాతం మంది హిందువులారా...మీరంతా ఓటు బ్యాంకుగా మారి దమ్ము చూపండి. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో షేక్ పేట ఓటర్లు పువ్వు గుర్తుపై గుద్ది షేక్ చేయండి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ’ అని స్పష్టం చేశారు.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)