Breaking News

‘రెడ్‌ బుక్‌ ఎక్కడ? అందరి సంగతి తేలుస్తాం!’

Published on Mon, 07/15/2024 - 20:37

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వైఎ‍స్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అధికారాన్ని ఆసరాగా తీసుకుని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. తాము చెప్పిందే వేదం.. చేసిందే రాజ్యాంగం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు చేసిన వ్యాఖ్యలే సాక్ష్యం.

కాగా, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సోమవారం విశాఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు చంద్రబాబును ఎయిర్‌పోర్టులో అడ్డుకుని నిర్భందించిన వారు ఎక్కడున్నారు?. ఇప్పుడు ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు?. రెడ్‌ బుక్‌ ఏమైంది?. బయటకు తీయాల్సిందే. వారిని కఠినంగా శిక్షించాలి.

ఎన్నికల సమయంలో వారి అంతు చూద్దామనుకున్నాను. వారిని దేవుడే చూసుకుంటాడులే అనుకుంటే కుదరదు. మనం బతికి ఉన్నప్పుడే వారి అంతు చూడాలి. కూటమికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని ఎవ్వరినీ వదిలేది లేదు. అందరి సంగతి తేలుస్తాం అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరోవైపు.. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ..‘బీజేపీ కార్యకర్తలను గుర్తించాలనే ఆలోచనతోనే నాకు పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ నేతలు అన్ని విషయాల్లో కలుగజేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎవ్వరినీ వదిలేది లేదు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతాం’ అంటూ సంచలన కామెంట్స్‌ చేశారు. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)