Breaking News

బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం

Published on Tue, 05/07/2024 - 21:18

ఒడిశాలో ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతుంది. ఈ తరుణంలో బీజేపీ అగ్రనేతలు ఒడిశాపై దృష‍్టి సారించారు. మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లు బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయనున్నారు. 

ప్రధాని మోదీ ఇటీవలే బెర్హంపూర్, నబరంగ్‌పూర్ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే మే 13న ఒడిశాలో మొదటి రౌండ్ ఎన్నికలకు ముందు కమలం నేతలు తమ ప్రచారాన్ని మరింత ఉదృతం చేయనున్నారు.

రాష్ట్ర బీజేపీ విశ్వసనీయ సమాచారం మేరకు మే 10న మోదీ భువనేశ్వర్‌లో రోడ్‌షో, మే 11న బొలంగీర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం మే 8న బరంగ్‌పూర్, కోరాపుట్‌లలో బహిరంగ సభలలో పాల్గొననున్నారు.  

అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు హైవే ప్రాజెక్టులు, ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆవశ్యకత వంటి అంశాలను హైలైట్ చేయనున్నారు. 

బీజేపీ జాతీయ నాయకులు,కేంద్ర మంత్రులతో ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. మరోవైపు ఒడిశా అధికార బీజేడీ మాత్రం సీఎం పట్నాయక్ ఆయన సన్నిహితుడు పాండియన్‌ ద్వయం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం మే 13 నుంచి జూన్ మధ్య నాలుగు సార్లు సుడిగాలు పర‍్యటనలు చేయనున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)