Breaking News

ఎన్డీయే కూటమి: ముగిసిన మంత్రివర్గ కసరత్తు

Published on Fri, 06/07/2024 - 21:32

ఢిల్లీ: ఎన్డీయే కూటమిలో భాగంగా ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పుపై శుక్రవారం జరిగిన కసరత్తు ముగిసింది. బీజేపీ జాతీయ అ‍ధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ అగ్రనేతల నేతృత్వంలో సుదీర్ఘంగా మంత్రివర్గ కూర్పుపై భేటీలు జరిగాయి. జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే భాగస్వామి పక్ష నేతలను ఒక్కొక్కరిని పిలిచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌లు చర్చలు జరిపారు. ముందుగా ఎన్సిపీ చీఫ్‌ అజిత్ పవార్, శివసేన చీఫ్‌ ఏక్‌నాథ్‌ షిండేతో బీజేపీ అగ్ర నేతలు చర్చించారు. అనంతరం టీడీపీ చీఫ్‌ చంద్రబాబుతో మంత్రివర్గంపై చర్చలు జరిపారు. అయితే మంత్రివర్గం కూర్పు ఫైనల్‌ అయిందా? లేదా? అనే అంశంపై అధకారికంగా స్పష్టత లేదు.


ఇక.. ఎన్డీయే పక్ష నేత నరే​ంద్ర మోదీ ఎల్లుండి( 9వ తేదీ) ప్రమాణస్వీకారం చేయటంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వ కొలువుదీరనుంది. అందుకోసం శుక్రవారం భాగస్వామ్య పక్ష నేతలు మోదీని ఏకగ్రీవంగా ఎన్డీయే పక్షనేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. మోదీ.. కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. ఎన్డీయే పక్షనేతగా తనను ఎన్నుకున్నారని రాష్ట్రపతికి మోదీ తెలిపారు. ఎంపీల మద్దతు లేఖను రాష్ట్రపతికి అందజేశారు.
 

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు