Breaking News

రెండు రోజుల్లో సర్కార్‌ అవినీతి స్కాం బయటపెడతా: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

Published on Thu, 01/02/2025 - 17:47

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రూ.వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని.. 2 రోజుల్లో ప్రభుత్వ అవినీతి కుంభకోణాన్ని బయటపడపెడతానంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ, కుంభకోణంలో మంత్రుల హస్తం ఉందని.. పూర్తి అధారాలతో కుంభకోణాన్ని బయటపెడతానన్నారు.

‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. అయినా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. కనీసం కొత్త సంవత్సరం అయినా గుర్తు తెచ్చుకుని నెరవేర్చాలి. ఏడాది పాటు ప్రజలను ఇబ్బందులు పెట్టి కనీసం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడంలేదు. ఈ దుర్మార్గాలను ఇకనైనా వీడి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. గత ఏడాది ఎగవేతల నామ సంవత్సరంగా ముగిసింది’’ అని మహేశ్వర్‌రెడ్డి చెప్పారు.

గత ఖరీఫ్‌లో రైతు భరోసా ఇవ్వలేదు.. ఇప్పుడు రబీ సీజన్‌లో అయినా ఇస్తారా?. మాయమాటలతో మోసం చేయడం తప్పా.. వారికి మంచి చేసే ఆలోచన కాంగ్రెస్‌కు ఉందా?. ఉప ముఖ్యమంత్రి భట్టి స్వయంగా రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు ఇస్తామని మాట ఇచ్చారు.. ఆ మాట ఇచ్చి డిసెంబర్ 28తోనే ఏడాది దాటిపోయింది. వారికి ఇవ్వకుండా ఆయన్ను అడ్డుకునేది ఎవరు?. లేదా ఆ డబ్బులు మరెవరికైనా కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు దాచారా?. మంత్రి పొంగులేటి కూడా ఇదే మాట ఇచ్చారు.. ఏమైంది?’’ అంటూ మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

‘‘రైతు భరోసాపై కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల్లో నివేదిక ఇస్తామన్నారు.. ఈ కమిటీ ఏర్పడి 4, 5 నెలలు దాటింది. అయినా దానికి సంబంధించిన విధి విధానాలు ఎందుకు ఇవ్వలేకపోయారు. 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఎప్పటిలోగా ఇస్తారో తేదీ కూడా అదే రోజు ప్రకటించాలి. 15 వేల చొప్పున ఇవ్వాలంటే ఒక్క సీజన్‌కు 23 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు సీజన్లకు కలిపి 46 వేల కోట్లు బకాయి ఉంది. కానీ సర్కార్ బడ్జెట్‌లో 15 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. మిగిలినవి ఎలా ఇస్తారో కాంగ్రెస్ సర్కార్ సమాధానం చెప్పాలి’ అని మహేశ్వర్‌రెడ్డి నిలదీశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)