Breaking News

తుది దశకు బీజేపీ అభ్యర్థుల జాబితా!

Published on Sat, 02/24/2024 - 09:42

సాక్షి, ఢిల్లీ: బీజేపీ హైకమాండ్‌ తెలంగాణపై మరోసారి ఫోకస్‌ పెట్టింది. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే నేడు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, రాష్ట్ర బీజేపీ నేతలు హస్తినకు బయలుదేరారు. 

కాగా, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డా తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇక, లోక్‌సభకు అభ్యర్థుల ఎంపిక చివరి దశకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా 17 ఎంపీ స్థానాల్లో సగం సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ గెలిచిన నాలుగు ఎంపీ సీట్లలో మూడింటిలో సిట్టింగ్‌ ఎంపీలను బరిలోకి దింపడంతో పాటు (ఆదిలాబాద్‌ మినహా), చేవెళ్ల, మహబూబ్‌నగర్, మల్కాజిగిరి, భువనగిరి, మెదక్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. నేడు దాదాపు ఒక్కొక్క అభ్యర్థిని ఫైనల్ చేయనుంది. ఇక, ప్రతీ నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 

ఇక, బీజేపీ కీలక భేటీ నేపథ్యంలో రాష్ట్ర నేతలు ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, లక్ష్మణ్‌, డీకే అరుణ హస్తినకు పయనమయ్యారు. కాగా, అభ్యర్థుల ఎంపికపై వీరు అధిష్టానంలో తుది చర్చలు జరుపనున్నారు. మార్చి రెండో వారంలో అభ్యర్థుల ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

ఎవరెవరు ఎక్కడెక్కడంటే..
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వీరికి టికెట్లు ఖరారు కావొచ్చునని, కొన్ని స్థానాల్లో ఆయా నేతలు టికెట్‌ కోసం పోటీకి ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 

  • సికింద్రాబాద్‌: కిషన్‌రెడ్డి
  • కరీంనగర్‌: బండి సంజయ్‌  
  • నిజామాబాద్‌: అర్వింద్‌ ధర్మపురి 
  • ఆదిలాబాద్‌: సోయంబాపూరావు లేదా బాపూరావు రాథోడ్, గుడెం నగేష్‌ 
  • మల్కాజిగిరి: ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, చాడ సురేష్ రెడ్డి, టి.వీరేందర్‌గౌడ్, పొన్నా ల హరీష్రెడ్డి  
  • జహీరాబాద్‌: ఎం.జైపాల్‌రెడ్డి, ఆలె భాస్కర్, అశోక్‌ ముస్తాపురె / ఓ ప్రముఖ సినీ నిర్మాత 
  • చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గవర్నర్‌ బండారు దత్తాత్రేయ వియ్యంకుడు బి. జనార్దనరెడ్డి 
  • మహబూబ్‌నగర్‌: డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి, శాంతకుమార్‌ 
  • భువనగిరి: బి.నర్సయ్యగౌడ్, జి. మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, శ్యాంసుందర్‌రెడ్డి 
  • మెదక్‌: ఎం.రఘునందన్‌రావు, జి. అంజిరెడ్డి  
  • వరంగల్‌: మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, చింతా సాంబమూర్తి  
  • నాగర్‌కర్నూల్‌: బంగారుశ్రుతి, కేఎస్‌ రత్నం  
  • హైదరాబాద్‌: టి.రాజాసింగ్, మాధవీలత, భగవంతరావు,  
  • పెద్దపల్లి: టి.కుమార్‌ లేదా ఎవరైనా కొత్త నేతకు అవకాశం 
  • నల్లగొండ: మన్నె రంజిత్‌యాదవ్‌ లేదా పార్టీలో చేరే మరో నాయకుడికి  
  • మహబుబాబాద్‌: హుస్సేన్‌నాయక్‌ / మరొకరికి
  • ఖమ్మం: దేవకీ వాసుదేవరావు, వినోద్‌రావు,  రంగా కిరణ్‌  

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)