Breaking News

నవీన్‌ చరిష్మాకు తెర!

Published on Wed, 06/05/2024 - 05:05

సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్‌ పట్నియక్‌ 24 ఏళ్ల పాలనకు తెర పడింది. ఆయన సారథ్యంలోని బిజూ జనతా దళ్‌(బీజేడీ) పార్టీ అధికారం కోల్పోయింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఒడిశా అస్మిత (ఆత్మగౌరవం) నినాదానికి తోడు బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్‌ షాల ప్రచారం బీజేపీని విజయతీరాలకు చేర్చింది. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 23 చోట్ల గెలిచింది. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన కమలం పార్టీ తొలిసారి అధికారపీఠాన్ని కైవసం చేసుకుంది.  2019 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 113 చోట్ల గెలిచిన బీజేడీ ఈసారి 51 చోట్ల, కాంగ్రెస్‌ 14 చోట్ల, సీపీఐఎం ఒకచోట గెలిచాయి.    

సుదీర్ఘ సీఎం రికార్డ్‌ మిస్‌ 
2000 సంవత్సరం నుంచి నవీన్‌ పట్నాయక్‌ ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా పటా్నయక్‌ పార్టీ గెలిచి సీఎం పదవి చేపడితే దేశంలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకునేవారు. అయితే బీజేడీ విజయయాత్రకు బీజేపీ బ్రేకులు వేసింది. హింజిలి నియోజకవర్గంలో కేవలం 4,636 ఓట్ల తేడాతో నవీన్‌ ఎలాగోలా గెలిచారు.

పనిచేసిన ఒడిశా అస్మిత నినాదం  
ఈ ఎన్నికల్లో సమస్యల కంటే బీజేపీ ‘ఒడిశా అస్మిత’ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. నవీన్‌ పట్నియక్‌ అనారోగ్య కారణాలను ఆసరాగా చేసుకుని తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి కార్తికేయ పాండియన్‌ బీజేడీ పారీ్టపై ఆధిపత్యాన్ని చలాయించారు. ఈ అంశాన్ని బీజేపీ విజయవంతంగా ప్రచార అస్త్రంగా మలిచింది. ఒడిశా భవిష్యత్తును స్థానికేతరుల చేతిలో పెట్టి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేడీ తాకట్టు పెట్టిందని పాండ్యన్‌ లక్ష్యంగా అస్మిత నినాదాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. వ్యక్తిగతంగా పటా్నయక్‌ అవినీతి మరకలు లేని నేత. కానీ బీజేడీ సర్కార్‌లో మంత్రులఅవినీతినే ప్రధాన ప్రచారా్రస్తాలుగా మలచి బీజేపీ విజయబావుటా ఎగరేసింది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)