Breaking News

నాగపూర్‌ రోడ్‌ షోలో బీజేపీ జెండాలు.. ప్రియాంక రియాక్షన్‌ ఇదే!

Published on Mon, 11/18/2024 - 16:57

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆర్‌ఎస్‌ఎస్‌ కంచుకోట అయిన నాగపూర్‌లో ఆదివారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక భవనంపై ఉన్న బీజేపీ మద్దతుదారులు ఆ పార్టీ జెండాలను ఊపి నినాదాలు చేశారు. ఇది చూసి కాంగ్రెస్ మద్దతుదారులు కూడా తమ పార్టీ నినాదాలు చేశారు.

దీనిని గమనించిన ప్రియాంక గాంధీ.. చిరునవ్వుతో  స్పందించారు. బుధవారం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల  పోలింగ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. మైక్ తీసుకొని వారినుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘బీజేపీ మిత్రులారా, మీకు ఎన్నికల శుభాకాంక్షలు. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరద్‌ పవార్‌) నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి గెలుస్తుంది’ అని అన్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

కాగా బీజేపీ సైద్దాంతిక మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం నాగ్‌పూర్‌లోనే ఉంది. దీనిని బీజేపీ కంచుకోటగా పరగణిస్తారు. 2014 నుంచి నాగ్‌పూర్‌ లోక్‌సభ స్థానానికి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీని పరిధిలోని ఆరు ఆసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. 

ఇక మహారాష్ట్ర నవంబర్‌ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వయనాడ్  ఉపఎన్నికతో ప్రత్యక్ష  ఎన్నికల బరిలో దిగుతున్నారు. మహారాష్ట్రలో నవంబర్ 20 రోడ్‌షోలో పాల్గొన్నారు. నాగ్‌పూర్ వెస్ట్, నాగ్‌పూర్ సెంట్రల్ నియోజకవర్గాల మీదుగా సాగిన ఈ రోడ్‌షోకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. నాగ్‌పూర్ వెస్ట్ ప్రస్తుతం కాంగ్రెస్ ఆధీనంలో ఉండగా.. నాగ్‌పూర్ సెంట్రల్ 2009 నుంచి బీజేపీ చేతిలో ఉంది.

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)