Breaking News

లిక్క‌ర్ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్‌.. బీజేపీ కుట్ర‌లు బ‌హిర్గ‌తం: ఆప్‌

Published on Fri, 07/12/2024 - 16:41

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మ‌ద్యంత‌ర బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈడీ కేసులో బెయిల్ ల‌భించిన‌ప్ప‌టికీ.. ఇదే లిక్క‌ర్ స్కామ్‌కు సంబంధించిన‌ సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ క‌స్ట‌డీ పొడిగించ‌డంతో ఆయ‌న జూలై 25 వ‌ర‌కు జైలులోనే ఉండ‌నున్నారు.

అయితే కేజ్రీవాల్ మ‌ధ్యంత‌ర బెయిల్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం నెల‌కొంది. సుప్రీంతీర్పుపై ఆప్ సంబరాలు చేస్తోంది. బీజేపీ కుట్ర‌ల‌ను న్యాయ‌స్థానం బ‌ట్ట‌బ‌య‌లు చేసింద‌ని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల‌ను స్వాగ‌తిస్తూ..  సత్యమేవ జయతే  అంటూ కేజ్రీవాల్ త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఉన్న చిత్రాన్ని ఆప్ షేర్ చేసింది.

 తీర్పు అనంతరం విలేకరుల సమావేశంలో ఢిల్లీ మంత్రి అతిషి మాట్లాడుతూ.. ఢిల్లీలో పాల‌న‌ ఆపేందుకు సీఎం కేజ్రీవాల్‌ను తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఇది చారిత్రాత్మకమైన తీర్పు అని  ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ పేర్కొన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసును బీజేపీ సర్కస్‌గా అభివ‌ర్ణించారు. బీజేపీ పన్నిన మద్యం కుంభకోణాన్ని సుప్రీంకోర్టు కూల్చివేసింద‌ని ఆయన అన్నారు.

 అయితే ఆప్ ట్వీట్‌కు బీజేపీ కౌంట‌ర్ ఇచ్చింది. కేజ్రీవాల్‌కు కోర్టు మాత్ర‌మే ఇచ్చింద‌ని, నిర్ధోషిగా విడుద‌ల కాలేద‌ని చుర‌క‌లంటించింది. మధ్యంతర బెయిల్ పొందడం అంటే నేరం నుంచి విముక్తి పొందడం కాదని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర స‌చ్‌దేవా పేర్కొన్నారు.  కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో ముద్దాయి అని మొత్తం స్కాం వెనుక ఆయ‌నే సూత్రధారి అని ఆరోపించారు. ఢిల్లీ ప్రజలను సీఎం లూటీ చేశాడ‌ని, సీఎం ప‌ద‌వికి కేజ్రీవాల్ రాజీనామా  చేయాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)