Breaking News

మమతా వర్సెస్‌ మోదీ: బెంగాల్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు!

Published on Thu, 02/08/2024 - 17:01

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో  దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలు అధిక సీట్ల గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గతంతో పోల్చితే ఈసారి కొంత మెరుగైన ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా విడుదలైన ‘ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ నేషన్‌’ ఎన్నికల  ఫలితాల అంచనాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 19 సీట్లు గెలుస్తుందని వెల్లడించింది. 2019లో ఊహించని విధంగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 18 సీట్లు గెలుచుకున్న విషయం  తెలిసిందే.  ఈసారి దాని కంటే ఒక సీటు అదనంగా గెలుస్తుందని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి.

ఇక.. బెంగాల్‌లో అధికారంలో టీఎంసీ ఈసారి కూడా 22 స్థానాలకే పరిమితమవుందని వెల్లడించింది. గత పార్లమెంట్‌లో టీఎంసీ 22 ఎంపీ సీట్లలో విజయం సాధించింది.  అయితే 2024 పార్లమెంగ్‌ ఎ‍న్నికల్లో సైతం 22 స్థానాలు గెలుస్తుందని పేర్కొంది. ఇక.. కాంగ్రెస్‌ ఈసారిగా కేవలం ఒకే  ఒక స్థానంలో గెలిచి.. మూడు స్థానంలో నిలవనున్నట్లు తెలిపింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ  రెండు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.

ఓటు షేరు విషయంలో కూడా ఎన్డీయే కూటమి గతం పార్లమెంట్‌ ఎన్నికల్లో సాధించిన 40 శాతం.. ఈసారి కూడా సాధిస్తుందని సర్వే స్పష్టం చేసింది. అయితే ఓటు షేరు విషయంతో  ఇండియా కూటమి బెంగాల్‌లో 2019 పార్లమెంట్‌ ఎన్నికల సాధించిన 57 శాతానికి 4 శాతం తగ్గి.. 53 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. ఈ సర్వే ఫలితాలు గమనిస్తే.. ప్రతిపక్షాల ఇండియా కూటమిపై బెంగాల్‌ ప్రజలు నమ్మకం కలిగి ఉండరని తెలుసుస్తోంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలక వ్యవహరించే టీఎంసీ అధినేత్రి.. బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 42 పార్లమెంట్‌ స్థానాలు ఉన్న బెంగాల్‌  కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి కీలకంగా మారనున్న విషయం తెలిసిందే.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు