Breaking News

మోదీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది

Published on Tue, 05/30/2023 - 05:54

న్యూఢిల్లీ: గత వారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. పెరుగుతున్న ధరలను అదుపు చేశామని దురహంకారపూరిత వాదనలు చేస్తూనే తీవ్రమైన ద్రవ్యోల్బణం ద్వారా ప్రజలు సంపాదించిందంతా దోచుకుంటోందని ఆ పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ తొమ్మిదేళ్లలో పేదరికం అంచున జీవిస్తున్న ప్రజల జీవితాలను మోదీ ప్రభుత్వం ఏమాత్రం మార్చలేకపోయిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.

ముఖ్యమైన ప్రతి వస్తువుపైనా జీఎస్‌టీ భారం పడుతోందని, సామాన్యుడి జీవితం కష్టతరంగా మారిందన్నారు. కేంద్ర మంత్రులు, ఆ పార్టీ నేతలు మాత్రం తాము ఘనకార్యాలు సాధించామంటూ ప్రచారం మొదలుపెడతారంటూ జైరాం రమేశ్‌ ఎద్దేవా చేశారు. ‘మోదీ ప్రభుత్వం వాస్తవంగా సాధించినవి ఇవే..2014 నుంచి వాస్తవ ఆదాయాల్లో వృద్ధిరేటు– వ్యవసాయ కార్మికులకు: 0.8%, వ్యవసాయేతర కార్మికులకు: 0.2%, నిర్మాణ కార్మికులకు:–0.02%మాత్రమే.

అయినప్పటికీ, 2014 నుంచి నిత్యావసర వస్తువుల ధరలు– ఎల్పీజీ:169%, పెట్రోల్‌:57%, డీజిల్‌:78%, ఆవనూనె:58%, గోధుమపిండి:56%, పాలు:51% పెరిగాయి’’అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. అసంఘటిత రంగంలో వాస్తవ వేతనాల పెరుగుదల దాదాపు నిలిచిపోయిందంటూ వచ్చిన కథనాన్ని కూడా జైరాం రమేశ్‌ షేర్‌ చేశారు. అన్ని రంగాల ఆదాయాల్లో స్తబ్ధత నెలకొనగా గౌతమ్‌ ఆదానీ సంపద మాత్రం 2014 నుంచి 1,225% పెరిగిందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మే 26వ తేదీతో 9 ఏళ్లు పూర్తి చేసుకుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)