Breaking News

బీజేపీ థ్రిల్లింగ్‌ విక్టరీ.. కాంగ్రెస్‌కు బిగ్గెస్ట్‌ షాక్‌!

Published on Tue, 02/27/2024 - 20:31

సిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో థ్రిల్లింగ్‌ విక్టరీ నమోదు అయ్యింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓటింగ్‌లో ఫలితం సమం కావడంతో డ్రా కాగా.. టాస్‌లో తమ అభ్యర్థి  హర్ష మహాజన్‌ నెగ్గినట్లు బీజేపీ ప్రకటించుకుంది. దీంతో సంఖ్యా బలం లేకున్నా బీజేపీని అదృష్టం వరించినట్లయ్యింది. అయితే ఈ ఫలితంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

హిమాచల్‌ ప్రదేశ్‌ ఒక్క రాజ్యసభ సీటు ఉంది. దీనికి మంగళవారం ఓటింగ్‌ జరిగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 68 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో కాంగ్రెస్‌కు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరోవైపు బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే.. రాజ్యసభ సీటు గెల్చుకోవడానికి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు కంటే ఐదుగురు కాంగ్రెస్‌కు ఎక్కువే ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌ గెలుపు నల్లేరు మీద నడకే అని అంతా భావించారు. అయితే.. 

సంఖ్యా బలం లేకున్నా అనూహ్యంగా రాజ్యసభ బరిలో అభ్యర్థిని నిలిపింది బీజేపీ. దీంతో ఓటింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ జరిగిన ఓటింగ్‌లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీకే ఓటేసినట్లు. దీంతో ఊహించని రీతిలో..  ఫలితం 34-34తో సమం అయ్యింది. డ్రా కావడంతో టాస్‌ అనివార్యం కాగా.. అందులో తామే నెగ్గినట్లు బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత జైరామ్‌ థాకూర్‌ ప్రకటన కూడా చేశారు. అయితే.. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేశారనంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. 

కాంగ్రెస్‌ సర్కార్‌కు ముప్పు.. 
హిమాచల్‌ ప్రదేశ్‌ తాజా పరిణామాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. రాజ్యసభ ఫలితం పరిణామంతో ప్రభుత్వం మెజారిటీలో లేదని స్పష్టమవుతోందని జైరామ్‌ ఠాకూర్‌ అన్నారు. ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఠాకూర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. రేపటి బడ్జెట్‌ సమావేశాల తర్వాత ప్రభుత్వంపై ఫ్లోర్‌ టెస్ట్‌ ఒత్తిడికి డిమాండ్‌ చేస్తామని అన్నారాయన.  ఒకవేళ.. అదే జరిగితే రెండేళ్లు తిరగకుండానే హిమాచల్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది. అదే విధంగా దేశంలో కాంగ్రెస్‌ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. హిమాచల్‌ను కోల్పోతే ఆ సంఖ్య రెండుకే పరిమితం కానుంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)