Breaking News

బీజేపీ అభ్యర్థిపై రామచందర్‌ రావు కీలక ప్రకటన.. హస్తంతో పతంగి ఎగరేస్తారా?

Published on Mon, 10/13/2025 - 13:29

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్(Jubilee Hills Election) బీజేపీ అభ్యర్థి ప్రకటన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(Ramchander Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ(BJP Party) అభ్యర్థి ప్రకటన ఈరోజు సాయంత్రం కానీ.. రేపు(మంగళవారం) ఉండే అవకాశం ఉందన్నారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పార్టీ గెలవాలని వారి అభ్యర్థిని కాంగ్రెస్‌లోకి పంపించి పోటీ చేయిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ(Telangana BJP) బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ గుర్తు పైన పోటీ చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో హస్తంతోనే పతంగి ఎగిరేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఎంఐఎం పార్టీ గెలవాలని.. వారి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీలోకి పంపి పోటీ చేయిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం చేసింది. జూబ్లీహిల్స్‌లో ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేదు. విశ్వ నగరం కాదు.. విషాద నగరంగా మార్చారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌కు ఓటు వేసినా ఫలితం లేదు. అక్కడ బీఆర్‌ఎస్‌ గెలిచినా.. మళ్లీ కాంగ్రెస్‌లోకే వెళ్తారు. తెలంగాణలో బీజేపీనే అసలైన ప్రతిపక్షం. ప్రజాసమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుంది. ఉప ఎన్నికల్లో బీజేపీదే విజయం అని చెప్పుకొచ్చారు. 

ఇది కూడా చదవండి: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)