Breaking News

వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్‌ విమర్శలు

Published on Mon, 04/29/2024 - 10:51

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నుంచి పోటీ చేసిన నటుడు, బీజేపీ అభ్యర్థి అరుణ్‌ గోవిల్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే ముంబైకి వెళ్లిపోవడంపై కాంగ్రెస్‌ విమర్శల దాడి చేసింది.  ఆయన 'పారాచూట్ రాజకీయాలు' చేస్తున్నారని ఆరోపించింది.

“మీరట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్న అరుణ్ గోవిల్ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజునే ముంబైకి బయలుదేరినట్లు తెలిసింది. బహుశా ఆయన ప్రజల మధ్య ఉండడానికి కష్టపడి ఉండవచ్చు. ఈ వ్యక్తి నిన్న పోలింగ్ బూత్ లోపల వీడియోగ్రఫీ చేస్తున్నారు” అని యూపీ కాంగ్రెస్‌ చీఫ్ అజయ్ రాయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

“అలాంటి నాయకుడు, నటుడి నుంచి దేవుడే మనల్ని రక్షించగలడు! చాలా మంది బీజేపీ నేతల విధానం ఇదే. వీరికి ప్రజల పట్ల, ప్రాంతం పట్ల పట్టింపు లేదు. వారు పారాచూట్ రాజకీయాలను మాత్రమే నమ్ముతారు” అని రాసుకొచ్చారు.

టీవీ సీరియల్స్‌లో రాముడి పాత్రధారిగా ప్రసిద్ధి చెందిన అరుణ్‌ గోవిల్‌ కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించారు. “మార్చి 24న హోలీ నాడు భారతీయ జనతా పార్టీ నా పేరును ప్రకటించింది. వారి సూచనల మేరకు నేను మార్చి 26న మీ మధ్యకు వచ్చాను. నెల రోజుల పాటు మీతో ఉండి మీ మద్దతుతో ఎన్నికల ప్రచారం చేశాను. ఎన్నికలు పూర్తయ్యాయి. మీ ప్రేమ, మద్దతు, గౌరవానికి నేను మీకు చాలా కృతజ్ఞుడను” అంటూ ‘ఎక్స్‌’ ద్వారా పేర్కొన్నారు.

“ఇప్పుడు, పార్టీ సూచనల మేరకు, ఇక్కడ నా బాధ్యతలను నెరవేర్చడానికి నేను ముంబైలో ఉన్నాను. ఎన్నికల ప్రచారానికి నన్ను ఇతర ప్రాంతాలకు పంపాలని పార్టీ యోచిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే, మీరట్ ప్రజలు, కార్యకర్తలతో కలిసి మీ మధ్యే ఉంటాను” అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)