Breaking News

‘ఇండియా కూటమి అలా నెగ్గాలనుకుంది..’ నడ్డా సంచలన ఆరోపణలు

Published on Sat, 10/25/2025 - 10:39

బీహార్‌ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన ఆరోపణలకు దిగారు. చొరబాటుదారుల ఓట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇండియా కూటమి భావిస్తోందని.. అయితే ఎన్డీయే ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు సాగనివ్వబోదని అన్నారు. 

శుక్రవారం వైశాలి జిల్లాలో జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొని జేపీ నడ్డా  ప్రసంగించారు. ‘‘బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక పునఃసమీక్ష (special intensive revision)కు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఎందుకంటే.. చొరబాటుదారుల ఓట్ల ఆధారంగానే వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించారు కాబట్టి. కానీ, ఎన్డీయే ప్రభుత్వం అలాంటి ప్రయత్నాన్ని ఎప్పటికీ సాగనివ్వబోదు.. 

.. ఓటు చోరీ ఆరోపణలపై అఫిడవిట్లు సమర్పించాలని ఎన్నికల కమిషన్ కోరిన తర్వాత ప్రతిపక్షాలు ఆ ఆరోపణలపై మాట్లాడటమే మానేశాయి. అక్కడే అసలు వాస్తవం బయటపడింది. తమ ఆరోపణలకు ఆధారాలు చూపలేకనే వాళ్లు తోకముడిచారు అని నడ్డా ఎద్దేవా చేశారు. 

ఆర్జేడీది జంగిల్‌ రాజ్‌
లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీకి గూండా, రౌడీ పార్టీ అనే ముద్ర ఉందని నడ్డా ఆరోపించారు. 2005కి ముందు బీహార్‌లో శాంతి భద్రతలు ఎలా ఉండేవి?. డాక్టర్లు, వ్యాపారులు, న్యాయవాదులు అప్పట్లో కిడ్నాప్, హత్యలకు గురైన సంగతి ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ సమయంలో అప్పటి సీఎం లాలూ నివాసంలోనే ఫిర్యాదులపై చర్చలు జరిగేవి కదా.. నడ్డా ఆరోపించారు. కానీ.. 

నితీశ్‌ కుమార్‌లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం జంగిల్‌ రాజ్‌ నుంచి బీహార్‌ ప్రజలకు విముక్తి కలిగించిందని నడ్డా అన్నారు. గత 20 ఏళ్లుగా సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో బీహార్‌ గణనీయంగా పురోగతి సాధించిందని, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి గణనీయమైన నిధులూ బీహార్‌కు సమకూరుతున్నాయని నడ్డా అన్నారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించి ఆ అభివృద్ధిని కొనసాగించాలని ఈ సందర్భంగా మేధావులకు నడ్డా విజ్ఞప్తి చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)