Breaking News

నిజమైతే నిరూపించండి.. మంత్రి ఆనంకు భూమన సవాల్‌

Published on Sat, 01/11/2025 - 15:35

సాక్షి, తిరుపతి: తిరుపతి తొక్కిసలాట(tirupati stampede)లో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించిన సందర్భంగా.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) చేసిన అర్థం లేని ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) వీడియో ద్వారా ధీటుగా బదులిచ్చారు.

భూమన కరుణాకర్‌రెడ్డి ఏమన్నారంటే..:

‘మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాపై చేసిన ఆరోపణలు దారుణంగా ఉన్నాయి. నిజానికి మీ నిర్వాకం వల్ల ఆరుగురు మరణిస్తే, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది పోయి, జగన్‌పై ఆరోపణలు చేశారు. ఇది కచ్చితంగా మీరు స్థాయి దిగజారి మాట్లాడటమే. ఇంత హీనంగా మాట్లాడగలనని మీకు మీరు నిరూపించుకున్నారు. మీ మాటలతో తొక్కిసలాటలో మరణించిన వారి బంధువులు, క్షతగాత్రులను దారుణంగా అవమానించారు’.

‘తొక్కిసలాట బాధితులపై సానుభూతి చూపాల్సింది పోయి, పరామర్శించి ఆర్థిక సాయం చేయాల్సింది పోయి.. మేం డబ్బులిచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నామనడం రాజకీయం కాదా?. దీన్ని బట్టే ఎవరు రాజకీయం చేస్తున్నారో తేటతెల్లం అవుతోంది. మీకు క్షతగ్రాత్రుల మీద కూడా సదభిప్రాయం లేదని అర్థమవుతోంది. వారు మీ గురించి మాట్లాడలేదని మీరు ఇలా మాట్లాడుతారా? మీ అస్తిత్వానికి ఇబ్బంది వస్తుందని ఇలా ఆరోపణలు చేస్తారా?’.

‘మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ట్రాక్టర్లు అడ్డుపెట్టి అడ్డుకోవాలనుకోవడం దారుణం కాదా?. కనీస భధ్రత ఇవ్వాలని కూడా తెలియదా?. జగన్‌ ఆస్పత్రికి వస్తున్నారని తెలిసి కూడా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అంతసేపు అక్కడెందుకు ఉన్నారు?. అది కావాలనే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదా?. జగన్‌ ఆసుపత్రికి రాకుండా కుట్ర చేసిన మాట నిజం కాదా?’.

	మంత్రి ఆనంకు భూమన కరుణాకర్రెడ్డి సవాల్

ఇదీ చదవండి: బాబు డ్రామాలో పవన్‌ బకరా!

‘మిమ్మల్ని తిట్టించడం కోసం మేం ఆస్పత్రిలో డబ్బులిచ్చామన్నది సీసీ కెమెరాలో రికార్డయిందని అంటున్నారు కదా?. ఆనం రామనారాయణ రెడ్డికి సవాల్‌ చేస్తున్నాం. తొక్కిసలాట క్షతగాత్రులతో మిమ్మల్ని తిట్టించడం కోసమే మేము వారికి డబ్బులు ఇచ్చామంటున్నారు కదా!. ఒకవేళ అది నిజమైతే, మీకు నిజంగా దేవుడిపై భక్తి కలిగి ఉంటే మేం కేవలం మిమ్మల్ని తిట్టించడం కోసమే తొక్కిసలాట క్షతగాత్రులకు డబ్బులిచ్చినట్లు మీరు నిరూపించాలి. ఆ పని చేయలేకపోతే వెంటనే మీ పదవికి రాజీనామా చేయాలి’.

‘నిజానికి జగన్‌ వచ్చేవరకు మమ్మల్ని ఆసుపత్రి వైపు మీ పోలీసులు, అధికార గణం వెళ్లనీయలేదు. ఆ విషయం గుర్తుంచుకొండి. చంద్రబాబు పాలనపై ప్రజలకు ఏ అభిప్రాయం ఉందో ఇప్పటికే అందరికీ అర్థమవుతోంది. మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా.. మీ పార్టీలో ఎవరూ గుర్తించడం లేదనే మీరు, ఇలా ఆరోపణలు చేశారనేది స్పష్టంగా అర్థమవుతోంది’’ అని భూమన పేర్కొన్నారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)