Breaking News

రైతు భరోసా గొప్ప కార్యక్రమం

Published on Mon, 09/18/2023 - 03:14

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతులకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ తీసుకొస్తున్న రైతు భరోసా గొప్ప కార్యక్రమమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. ఇది తెలంగాణ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని రైతులకు ఎకరాకు ఏటా రూ.15వేల పెట్టుబడి సాయం అందిస్తామని.. కౌలు రైతులకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. వరి పండించే రైతులకు మద్దతు ధరపై క్వింటాల్‌కు రూ.500 బోనస్‌గా ఇస్తామని ప్రకటించారు. రైతు భరోసా గ్యారంటీ స్కీమ్‌ను ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు తెలంగాణ రైతాంగం తరపున అభినందనలు తెలుపుతున్నామన్నారు.  

బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌­ఎస్‌కు ఓటు వేస్తే నేరుగా బీజేపీకి ఓటు వేసి నట్టుగా భావించాలని సీఎల్పీనేత భట్టి విక్రమార్క ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు హోటల్‌ తాజ్‌ కృష్ణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌కు పడిన ప్రతి ఓటు బీజేపీకి బదిలీ అవుతుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌లో బీజేపీ ప్రజా వ్యతిరేక నిర్ణయా లకు ఓటు వేసి సమర్థిస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌లు పరస్పరం సహకరించుకుంటూ ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు కోసమే కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలని ప్రకటిస్తోందని తెలిపారు. 

Videos

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)