Breaking News

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే కాంగ్రెస్‌ ఎజెండా 

Published on Thu, 08/03/2023 - 02:21

సాక్షి, హైదరాబాద్‌: తొమ్మిదేళ్ల రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే ఎజెండాగా కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో ఉద్యమసాధన ఆకాంక్షలు నెరవేరని తీరును ఎండగట్టాలని అనుకుంటోంది. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని సభ దృష్టికి తేవడం ద్వారా వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు వివరించేలా అసెంబ్లీలో గళమెత్తాలని నిర్ణయించింది.

దీంతో పాటు సీఎల్పినేత మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర అనుభవాలు, ప్రజలు ఏకరువు పెట్టిన సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారా వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం అశాస్త్రీయంగా జరుగుతోందని, ముఖ్యంగా మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల నిర్వహణలో ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం కారణంగానే తాజా వరదనష్టం జరిగిందని, ప్రాణ, ఆస్తి, పంట నష్టాలకు ప్రభుత్వ ఎత్తుగడల లోపమే కారణమనే అంశాలను ఫోకస్‌ చేయాలని నిర్ణయించింది.

కాగా, ఈ అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజుల పాటు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ఈ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకుగాను గురువారం కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఇక, ఈ అసెంబ్లీ గడువు తీరేలోపు ఇవే చివరి సమావేశాలనే చర్చ జరుగుతోంది. 2018 జరిగిన ఎన్నికల్లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన కాంగ్రెస్‌పార్టీ చివరి సమావేశాల నాటికి తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయి ఐదుగురికి మాత్రమే పరిమితం కావడం గమనార్హం.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)