కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే

Published on Mon, 04/08/2024 - 01:51

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో బీఆర్‌ ఎస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అధికారికంగా పార్టీలో చేరకపోయినా, కాంగ్రెస్‌ సమావేశాలకు కూడా ఆయన హాజరవుతున్నారు. శనివారం తుక్కుగూడలో జరిగిన జనజాతర సభకు కూడా ఆయన హాజరై వేదికపై కూర్చున్నారు.

ఈయన కాంగ్రెస్‌లోకి వస్తారన్న ప్రచారం చాలాకాలంగా జరుగుతున్నా ఆదివారం పార్టీ కండువా కప్పుకుని అధికారికంగా ఆ పార్టీలో చేరారు. వెంకట్రావు చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం లేకుండాపోయింది. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన తొమ్మిది ఎమ్మెల్యేలు ఆ జిల్లాలో ఉండగా, వెంకట్రావు చేరికతో పదికి పది చోట్లా ఇప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే కావడం, బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరడం గమనార్హం.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)