Breaking News

అయోధ్యకు రాహుల్ ఎందుకు రాలేదు?: బండి సంజయ్‌

Published on Mon, 01/22/2024 - 20:59

సాక్షి, కరీంనగర్‌:  హిందువులకు నేడు పండగ రోజని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. అయోధ్య కోసం పోరాడిన కర సేవకుల మీద కాల్పులు జరిపారని,  సరయు నదిలో గుట్టలుగా శవాలు తేలాయని అన్నారు. అయోధ​ పోరాటంలో తాను కూడా ఉండటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. నేడు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్ప నెరవేరిందని పేర్కొన్నారు. 

కర సేవకుల బలిదానాలు వృథాగా పోలేదని అన్నారు. కరసేవకుల కుటుంబాలకు ఇన్నేళ్లకు అసలైన పండుగ వచ్చిందన్నారు. అయిదు వందలవందల ఏళ్ల స్వప్నం నెరవేరడం ఆషామాషీ కాదని చెప్పారుజ కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీపై దాడి జరగలేదన్న బండి సంజయ్‌.. ప్రజల దృష్టి మరల్చడానికే ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రామమందిర నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. అయోధ్యకు రాహుల్ ఎందుకు రాలేదని నిలదీశారు. 

ఆలయ నిర్మాణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్షాలు ఎందుకు దూరంగా ఉన్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ వల్ల  హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. రాముడిపై ప్రశ్నిస్తున్న వారు దేశ పౌరులేనా?. నాస్తికులు, హేతువాదులు రాజ్యాంగాన్ని అవమానిస్తారా?.అని మండిపడ్డారు. మీ కుటుంబ సభ్యులను అడగండి.. రాముడు అయోధ్యలో పుట్టాడో లేదో తెలుస్తుందని అన్నారు.  ఈ దేశం తిండి తింటూ ఇక్కడి దేవుళ్లను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్యలో కన్నుల పండుగగా రామమందిర ప్రారంభోత్సవం

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)