Breaking News

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లది హైడ్రామా

Published on Sat, 08/31/2024 - 04:55

లింగోజిగూడ: ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్‌ఎస్‌తో కలిసి డ్రామాకు తెరలేపిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. ఇందులో భాగంగానే బీజేపీ లో బీఆర్‌ఎస్‌ విలీనమవుతుందని దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. సెప్టెంబర్‌ 3 నుంచి చేపట్టనున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా అర్బన్‌ సభ్యత్వ శిక్షణా తరగతులను శుక్రవారం నాగోల్‌లోని ఓ కన్వెన్షన్‌ హాల్లో నిర్వహించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కవిత తరఫున వాదించి ఆమెకు బెయిల్‌ ఇప్పించింది కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీయేనని అందరికీ తెలుసన్నారు. అందుకే తెలంగాణ నుంచి ఆయన రాజ్యసభ ఎంపీ పదవికి పోటీ చేస్తే 38 ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్‌ఎస్‌ కనీసం నామినేషన్‌ కూడా వేయ లేదని పేర్కొన్నారు. త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయమన్నారు. 

2019లో నార్త్‌ బ్లాక్‌లోకి వెళ్లలేకపోయా.. ఇప్పుడు అక్కడే పనిచేస్తున్నా
బీజేపీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యం, గుర్తింపు ఉంటుందని బండి సంజయ్‌ అన్నారు. 2019లో నార్త్‌ బ్లాక్‌లోకి వెళ్లలేక బయటి నుంచే సెల్ఫీ తీసుకున్న తాను... ఇప్పుడు అదే నార్త్‌ బ్లాక్‌లో కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నానని చెప్పారు. 2028 రాష్ట్రంలో బీజీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సూచించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్, రంగారెడ్డి జిల్లా అర్బన్‌ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, కొత్త రవీందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)