Breaking News

మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి హవా.. బండి సంజయ్‌ రియాక్షన్‌ ఇదే

Published on Sat, 11/23/2024 - 11:36

సాక్షి, కరీంనగర్ జిల్లా: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయదుందుభి మోగిస్తుందని.. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని రుజువైందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. బీజేపి ఒంటరిగా 125 స్థానాలు గెలవబోతుందని.. యూపీలో ఏడు స్థానాలలో  ముందంజలో ఉందన్నారు. ఎన్ని అబద్దాల ప్రచారం చేసిన ఎన్డీయే కూటమినే మహారాష్ట్ర ప్రజలు నమ్మారన్నారు. మహారాష్ట్రలో హిందూ సమాజం ‌ఐకమత్యాన్ని చాటారన్నారు.

కర్ణాటక, తెలంగాణ నుంచి మహారాష్ట్రకి కాంగ్రెస్ డబ్బులు పంపింది.  ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ వైఫల్యాలే మహారాష్ట్రలో గెలుపు వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన అన్ని‌ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. వాస్తవాన్ని గ్రహించారు కాబట్టే కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. మోదీ అభివృద్ధి మంత్రం పనిచేసింది.  ఇండియా కూటమి చీలీపోవడం ఖాయం. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కి ఇదే గతి పడుతుంది’’ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

‘‘మహారాష్ట్రలో కాంగ్రెస్ ‌పార్టీ మోసాలను మేము ప్రచారం చేశాం. ఇప్పటికైనా తెలంగాణలో‌ ఇచ్చిన హామీ నెరవెర్చండి.. లేదంటే మహారాష్ట్రలో పట్టిన గతే పడుతుంది. ఇచ్చింది ముఫ్ఫై వేల నోటిఫికేషన్ లు.. చెప్పింది‌ మాత్రం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని.. ఇక్కడి డబ్బులతో మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు’’ అని బండి సంజయ్‌ మండిపడ్డారు.

 

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు