Breaking News

తెలంగాణను నాశనం చేయడమే  వారిపని

Published on Sun, 10/01/2023 - 03:13

సాక్షి, న్యూఢిల్లీ: ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీఆర్‌ఎస్, ఎంఐఎం కలసి విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. ‘‘ఎంఐఎం కార్యకర్తలు నా ఇల్లు, ఆఫీస్‌పైకి ర్యాలీగా వెళ్లి దాడికి యత్నిస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఆత్మరక్షణ కోసం యత్నించిన బీజేపీ కార్యకర్తలపై ఉల్టా కేసులు పెట్టడం ద్వారా సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారు? మా సహనాన్ని చేతగానితనంగా భావిస్తే.. ఖబడ్దార్‌..’’అని హెచ్చరించారు.

శనివారం ఢిల్లీలో బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు.కొందరు పోలీసులు ప్రమోషన్లు, పోస్టింగుల కోసం బీఆర్‌ఎస్‌ చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని.. బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అదే బీఆర్‌ఎస్, ఎంఐంఎం నేతలు, కార్యకర్తలు కుట్రలు చేస్తున్నా పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు.

ఎంఐఎం అడ్డా అని చెప్పుకుంటున్న పాతబస్తీకి వెళ్లి కాషాయ జెండా ఎగరేసిన చరిత్ర తమదని.. ఒక పార్టీకి, వర్గానికి కొమ్ము కాస్తే దీటుగా ఎదుర్కొనే సత్తా బీజేపీకి ఉందనే సంగతిని పోలీసులు, బీఆర్‌ఎస్‌ నేతలు గుర్తుంచుకోవాలని సంజయ్‌ వ్యాఖ్యానించారు. ముస్లిం మేధావులు కూడా ఎంఐఎం ఆగడాలను చీదరించుకుంటున్నారని విమర్శించారు. ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ అరాచకాలను, ఆగడాలను ఆపేదాకా బీజేపీ పోరాడుతుందన్నారు. బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)